Friday, March 19, 2010

గిరిజనంతో విదేశీ ఆట

టీకా ప్రయోగాల కేంద్రంగా ఖమ్మం ఏజెన్సీ
నలుగురు బాలికల అనుమానాస్పద మృతి!
కారణాలు వేరంటూ ముగించిన సర్కార్!
గిరిజనులపైనే ఎందుకు?: ఎంపీ బలరాం
నిలదీయరన్న నమ్మకంతోనే: సంఘాలు
క్లినికల్ ట్రయల్స్ కాదన్న ఆరోగ్యమంత్రి
తెలంగాణ ప్రజలు జంతువులా: టీఆర్ఎస్

క్యాన్సర్ టీకాల ప్రయోగం వికటించిందన్న వార్తల నేపథ్యంలో అసలా ప్రయోగాలకు రోశయ్య సర్కారు ఎలా అనుమతిస్తుందని కడప ఎంపీ జగన్మోహన్‌రెడ్డి నిలదీస్తున్నారు. ఈ టీకాలకు ఎవరు అనుమతిచ్చారో నాకు తెలియదు... అంటూ రోశయ్య.. పరోక్షంగా వాటికి అనుమతి ఇచ్చింది వైఎస్ అన్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు.

రాష్ట్ర ఆరోగ్య మంత్రి ఇవి క్లినికల్ ట్రయల్స్ కావని స్పష్టం చేస్తున్నారు. బాలికలు చనిపోవడానికి, టీకాలకు సంబంధం లేదని తేల్చేశారు. ఈ నేపథ్యంలో అసలు ఖమ్మం ఏజెన్సీలో ఏం జరుగుతోందో ఒక సారి గమనిస్తే....

లైంగిక సంబంధాల్లో హెచ్‌పీవీ అనే వైరస్ ద్వారా వచ్చే సర్వైకల్ క్యాన్సర్‌ను నివారించే టీకాను శాస్త్రవేత్తలు 20 ఏళ్ల పాటు పరిశోధించి తయారు చేశారు. దీని పేరు గర్ధాసిల్. దీనిని మూడు డోసులు తీసుకుంటే జీవితాంతం గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ రాదని కంపెనీ చెబుతోంది. అమెరికా సహా అనేక దేశాల వైద్యసంస్థలు ఈ టీకాను ఆమోదించాయని చెబుతున్నారు.

మన దేశంలో 'పాత్' అనే ప్రభుత్వేతర సంస్థ బిల్ అండ్ మిలిండా గేట్స్ ఫౌండేషన్ ఆర్థిక సహాయంతో టీకాల కార్యక్రమాన్ని చేపట్టింది. గుజరాత్‌లోని వడోదరా, ఆంధ్రప్రదేశ్‌లోని ఖమ్మం జిల్లా ఏజెన్సీలను ఎంచుకుంది.

2008 డిసెంబర్ 31న ఈ ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతిచ్చింది. టీకాలకు 10-14 ఏళ్ల వయసు గల బాలికలను ఎంచుకున్నారు. కొత్తగూడెం, భద్రాచలం, తిరుమలాయపాలెంలలో క్యాం పులు పెట్టి 14,091 మంది బాలికలకు టీకాలు వేశారు. వీరిలో 70% గిరిజన బాలికలే. అధికారులు మాత్రం 30% మందే గిరిజన బాలికలని చెబుతున్నారు.

నలుగురి మరణం....
టీకాలు తీసుకున్న వారిలో గిరిజన బాలికలు కె.సరిత (13), సోడే సాయికుమారి(14), క ంపెల్లి స్వాతి(13) ముంద్రబోయిన సూర్యలక్ష్మి (12) చనిపోయారు. సరిత, సాయికుమారి ఆత్మహత్య చేసుకున్నారని ప్రభుత్వం చెబుతోంది. సరిత మరణించే నాటికి రెండు డోసుల టీకా తీసుకున్నారు.

భద్రాచలం మండ లం ఎర్రగడ్డకు చెందిన సోడే సాయికుమారి మొదటి దశ టీకా వేసుకున్న 14 రోజుల తర్వాత మరణించింది. కంపెల్లి స్వాతికి గత ఏడాది జూలై 17న టీకా ఇచ్చారు. ఆమె తీవ్ర జ్వరంతో ఆగస్టు 8న మరణించారు. సూర్యలక్ష్మి ప్రమాద వశాత్తు చనిపోయినట్లు ప్రభుత్వం నివేదికలో పేర్కొంది.

ఏజెన్సీనే ఎందుకు ఎంచుకున్నారు?
గతంలో చిన్న పిల్లలకు అంగవైక్యలం రాకుండా ఇచ్చే టీకాలకు కూడా తొలుత ఖమ్మం ఏజెన్సీనే ఎంచుకున్నారు. ఇప్పుడు క్యాన్సర్ టీకాలకు కూడా ఈ ప్రాంతాన్నే ఎంచుకున్నారు. ఇందుకు గిరిజన సంఘాలు కొన్ని కారణాలు చెబుతున్నాయి.

"ఏజెన్సీలో టీకాలు వికటించి మరణించినా... అవి రోజువారి చావు ల ఖాతాలోకి వెళ్తాయి. ఈ మనిషి ఎందుకు చనిపోయాడు? టీకా వికటించిం దా? అని పరిశీలించే నాథుడు ఉండరు. గిరిజనులయితే చెప్పింది వింటారు. గిరిజనేతరులకు చదువు ఉంటుంది కాబట్టి ప్రయోగాలపై సవాలక్ష సందేహాలడుగుతారు. ఎవరైనా చనిపోతే గొడవైపోతుంది. అందుకే గిరిజన ప్రాంతాలను ఎంచుకుంటారు'' అని లంబాడా హక్కుల పోరాట సమితి నేత బెల్లయ్య నాయక్ చెబుతున్నారు.

టీకాలు తీసుకున్నాక తలెత్తిన ఆరోగ్య సమస్యలకు అత్యవసర వైద్యం పొందే అవకాశం ఉండటం లేదు. స్వాతి మరణానికి ఇదే ప్రధాన కారణమని గిరిజన సంఘాలు చెబుతున్నాయి. ఇక సరిత, సూర్యలక్ష్మిలు ఆత్మహత్యచేసుకున్నారని అధికారులు చెబుతున్నారు. వీరి ఆత్మహత్యలకు ఎలాంటి కారణాలు లేవు. కారణం లేకుండానే ఆత్మహత్యలు ఎందుకు చేసుకున్నారన్న ప్రశ్నకు జవాబు లేదు. పాత్ సంస్థ, ప్రభుత్వ పరపతిని కాపాడుకునేందుకు అధికారులు ఆ మరణాలను ఆత్మహత్యలుగా చిత్రీకరిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ఏజెన్సీలో ఎలా అనుమతిస్తారు? ఎంపీ బలరాం నాయక్
గిరిజన బాలికల మరణాలపై కాంగ్రెస్ ఎంపీ బలరాం నాయక్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. గురువారం ఆన్‌లైన్ ఆయన్ను పలకరించినప్పుడు ఆవేదన వ్యక్తం చేశా రు. "ఏజెన్సీలో ప్రయోగాత్మక టీకాలు వేసేందుకు ఎలా అనుమతిస్తారు? హైదరాబాద్ లాంటి ప్రాంతాల్లో ఎందు కు ఆ కార్యక్రమాన్ని అమలు చేయరు?'' అని ప్రశ్నించారు. బాలికల మరణాలపై విచారణ జరిపించాలని ఆయన కోరారు.

టీకాలను తెలంగాణ ప్రాంతంలో ప్రయోగించటంపై టీఆర్ఎస్ మండిపడింది. తొలుత జంతువులపై ప్రయోగించాల్సిన మందును మనుషులపై ప్రయోగించటానికి ఎలా అనుమతించారని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. మందులు ప్రయోగించటానికి తెలంగాణ ప్రజలు జంతువులా? అని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు గురువారం ఆగ్రహం వ్యక్తం చేశారు.

టార్గెట్ 2010

నల్లధనంపై కాంగ్రెస్, ఎస్పీలకు సవాల్

న్యూఢిల్లీ, మార్చి 18: ఓ వైపు పెద్ద ఎత్తున రగడ జరుగుతున్నా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి, బీఎస్పీ అధినేత్రి మాయావతి మరో కరెన్సీ గజమాలను స్వీకరించడం వెనుక ఉద్దేశమేంటి? తనపై విమర్శలకు ప్రతిపక్షాలను ఉసిగొల్పేలా అవకాశం ఇవ్వడం వెనుక ఎత్తుగడలున్నాయా? ఇప్పుడు రాజకీయవర్గాల్లో ఇదో పెద్ద చర్చ.

కాంగ్రెస్ నేతలు తనను దళిత పుత్రిక కాదు.. ధనిక పుత్రిక అంటూ విమర్శలు గుప్పిస్తున్నా.. మాయావతి చర్యలు పకడ్బందీ వ్యూహంతోనే ఉంటున్నాయనేది ఆ పార్టీ కార్యకలాపాలను దగ్గరగా పరిశీలిస్తున్న రాజకీయ విశ్లేషకుల వ్యాఖ్య. అటు క్షత్రియులు.. ఇటు బ్రాహ్మణులను సైతం తనవైపు తిప్పుకుని గత అసెంబ్లీ ఎన్నికల్లో మాయావతి ఘన విజయం సాధించారు.

ఒక దశలో మాయావతి కాబోయే దేశ ప్రధాని అన్న వాతావరణం కూడా నెలకొంది. బీఎస్పీ కూడా.. తమ తదుపరి లక్ష్యం హస్తిన పీఠమేనని ప్రకటించింది. లోక్‌సభ ఎన్నికల్లో సమాజ్‌వాది ఘోరంగా దెబ్బతిన్నది. కేంద్రంలో అధికారంలోకి రాగలిగినా.. యూపీలో కాంగ్రెస్ చెప్పుకోదగ్గ ఫలితాలు సాధించలేదు.

అయితే ప్రస్తుతం యూపీలో కాంగ్రెస్‌కు పూర్వ వైభవం సాధించేందుకు ఆ పార్టీ యువ ఎంపీ రాహుల్ గాంధీ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. పదే పదే యూపీలో పర్యటనలు చేయడం, సాధారణ ప్రజలతో మమేకమవడం తదితర క్షేత్ర స్థాయి కార్యకలాపాలతో పాటు.. రాష్ట్రంలో యూత్ కాంగ్రెస్‌ను పునరుజ్జీవింప చేసే యత్నాల్లో ఉన్నారు.

ఆ దిశగా కొంత పురోగతి కూడా సాధించారని ఇటీవలి యూత్ కాంగ్రెస్ సభ్యత్వ నమోదు వెల్లడిస్తోంది. దేశంలోనే అత్యధిక సభ్యత్వం యూత్ కాంగ్రెస్్‌కు ఇక్కడే లభించింది. ఈ నేపథ్యంలో ఆమె కాంగ్రెస్‌నే తన ప్రధాన లక్ష్యంగా చేసుకుంటున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు. కాంగ్రెస్‌ను ఇరకాటంలోకి నెట్టేందుకు నల్లధనం అంశాన్ని బయటకు తీయాలనేది మాయావతి ఆలోచనగా చెబుతున్నారు.

బహిరంగంగా విరాళాలు స్వీకరించడం ఇందులో భాగమేనన్న వాదన వినిపిస్తోంది. గతంలో కూడా మాయావతి తన పుట్టిన రోజుల సందర్భంగా, పార్టీ ఆవిర్భావ దినోత్సవాల సందర్భంగా పెద్ద ఎత్తున నగదు రూపంలో బహుమతులు స్వీకరించేవారు! వీటన్నింటిలో బహిరంగంగా విరాళం స్వీకరించడం అనే ఒక ఉమ్మడి అంశం కనిపిస్తుంది.

తాజాగా రెండు దండలనూ మాయావతి బహిరంగంగానే స్వీకరించారు. తద్వారా మనువాదపార్టీలను బహిరంగంగా సవాలు చేయాలన్న ఉద్దేశంతో మాయవతి ఉన్నారని పరిశీలకులు అంటున్నారు. మనీవాదిగా తనపై ముద్ర పడుతున్నప్పటికీ.. అది ప్రత్యర్థి పార్టీలను రెచ్చగొట్టి.. తన ఉచ్చులోకిలాగే ప్రయత్నమన్న వాదన కూడా వినిపిస్తోం ది.

నగదు వ్యవహారంపై ఆ పార్టీలు మాట్లాడితే.. నల్లధనం అంశంపై వాటిని కార్నర్ చేయడం మాయ వ్యూహంగా కనిపిస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కూడా ఆమె ఈ అంశాన్ని ప్రస్తావించారు. సమాజ్‌వాది, కాంగ్రెస్ నాయకులకు విదేశాల్లో పెద్దఎత్తున నల్లధనం ఖాతాలున్నాయని, తాము అధికారంలోకి వస్తే వాటి ని వెనక్కు తెప్పిస్తామని కూడా ప్రకటించారు.

తన విగ్రహాలను, ఏనుగుబొమ్మలను ప్రతిష్ఠించడాన్నీ ఆమె సమర్థించుకుంటున్నారు. లక్నోలో విగ్రహాల ఏర్పాటు నేపథ్యంలో.. తమ పార్టీ ఎన్నికల చిహ్నాన్ని ఈసీ రద్దు చేసేట్లయితే.. కాంగ్రెస్ , సమాజ్‌వాది పార్టీల ఎన్నికల గుర్తులను కూడా రద్దు చేయాలని ఆమె సవాలు చేస్తూ.. ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉండగానే ప్రధాన పక్షాలతో కయ్యానికి సై అంటున్నారు.

మొత్తానికి.. గత ఎన్నికల్లో 'సోషల్ ఇంజనీరింగ్' ద్వారా అధికారంలోకి వచ్చిన మాయావతి.. తాజాగా.. మనువాదులను సవాలు చేస్తూ.. ఆ అధికారాన్ని 2012 ఎన్నికల్లో నిలుపుకోవడం కోసం వ్యూహ రచనలో నిమగ్నమై ఉన్నారని చెబుతున్నారు.

ఇళ్లు కట్టి చూడరు!

అమలు కాని మంత్రి మాట
మొదలు కాని లబ్ధిదారుల ఎంపిక
కొత్త ఇళ్లకు 'బోగస్' అడ్డంకి
ఎంతకీ తేలని అనర్హుల లెక్క
బడ్జెట్‌లోనూ అరకొర కేటాయింపులు
కొత్త ఇళ్ల మంజూరుపై సందేహాలు
ముందే హెచ్చరించిన 'ఆంధ్రజ్యోతి'

'ఇందిరమ్మ' ఇంటి కథ కంచికి చేరుతోంది. మంజూరు చేసిన వాటిలో లక్షల ఇళ్లు బోగస్! మంత్రిగారి మాటలు బోగస్! అంకెల గొప్పలకు పోయి విచ్చలవిడిగా లక్షల్లో ఇళ్లు మంజూరు చేశారు. వాటిలో 'బోగస్' ఏరివేత ప్రారంభించారు. ఈ ప్రహసనం ముగియకముందే... ఫిబ్రవరిలో కొత్త ఇళ్లు మంజూరు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. కానీ... ఆ తర్వాత ఊసే మరిచిపోయింది.

కొత్త ఇళ్ల మంజూరు గురించి జనవరి 11న గృహ నిర్మాణ శాఖ మంత్రి శిల్పా మోహన్‌రెడ్డి ప్రకటించారు. ఆ శాఖకు చెందిన ప్రాజెక్టు డైరెక్టర్లతో సమీక్ష నిర్వహించిన అనంతరం ఆయన ఈ విషయం తెలిపారు. అయితే.. ఫిబ్రవరి నెల గడిచినా అర్హులైన లబ్ధిదారులకు ఇళ్లు మంజూరు చేసే ప్రక్రియ మొదలుకాలేదు. అసలు ఇది ఎప్పుడు మొదలవుతుందో తెలియని పరిస్థితి నెలకొందని ఆ శాఖ వర్గాలు తెలిపాయి.

పాత లబ్ధిదారుల్లో బోగస్ లెక్క తేలితేగానీ... కొత్త లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ మొదలయ్యే అవకాశం లేదు. గతంలో ప్రభుత్వం అడగని వాడిదే పాపం అన్నట్లుగా... అర్హతలతో సంబంధం లేకుండా అడ్డగోలుగా ఇళ్ళు మంజూరు చేస్తూ పోయింది. ఎన్నికలు దగ్గర పడే కొద్దీ 'రికార్డు' స్థాయిలో ఇళ్ల సంఖ్య పెంచుకుంటూ పోయింది.

ఇందిరమ్మ తొలి దశలో 23,91,776... రెండో దశలో 29,58,870 ఇళ్లు, మూడో దశ కింద 25,26,059 ఇళ్ళు మంజూరు చేశారు. దీంతో పాత ఇళ్ళు 2,62,572 కలుపుకొంటే మూడు దశల్లో ఇందిరమ్మ కింద మంజూరు చేసిన ఇళ్ల సంఖ్య 81,29,277కి చేరింది. ఇందిరమ్మ పథకం తొలి దశ పూర్తయినప్పుడే... ఈ పథకం బోగస్ లబ్ధిదారుల చేతుల్లోకి వెళుతోందని 'ఆంధ్రజ్యోతి' వెలుగులోకి తెచ్చింది.

అనర్హులకు ఇల్లు మంజూరు చేయడం, ఒక్కొక్కరు రెండు మూడేసి ఇళ్లు మంజూరు చేయించుకోవడం, మితిమీరిన రాజకీయ జోక్యం... వంటి అక్రమాలపై వరుస కథనాలు ప్రచురించింది. దీనిపై స్పందించిన అప్పటి గృహ నిర్మాణ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ 'బోగస్ ఇల్లు చూపిస్తే వెయ్యి రూపాయలు బహుమతి' అని ప్రకటించారు. ఆ తర్వాత 'ఆంధ్రజ్యోతి' ఎన్నో బోగస్ ఇళ్లను చూపించింది.

వామపక్షాలు సైతం ఇందిరమ్మ ఇళ్లలో అవతకవతకలపై ఉద్యమించాయి. ఈ వాస్తవాలను కొట్టివేస్తూ వచ్చిన ప్రభుత్వానికి... రెండోసారి అధికారంలోకి వచ్చాకగానీ అసలు విషయం అర్థం కాలేదు. పరిస్థితి తీవ్రతను గమనించి ప్రభుత్వమే బోగస్ లబ్ధిదారుల ఏరివేత ప్రారంభించింది. దుర్వినియోగమైన నిధులను రెవెన్యూ రివకరీ చట్టం ద్వారా రాబట్టేందుకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసింది. ఇప్పుడు బోగస్ లబ్ధిదారుల గుర్తింపుతో ముడిపెట్టి... కొత్త లబ్ధిదారుల ఎంపికను జాప్యం చేస్తోంది.

అసలుకే చిల్లు...
ఇందిరమ్మ పథకం కింద మూడు దశల్లో మంజూరు చేసిన ఇళ్లలో వాటిలో 19 లక్షల లబ్ధిదారుల వివరాలు 'ఆన్‌లైన్'లో నమోదు కాలేదు. దీంతోపాటు మరో 17 లక్షల ఇళ్లు ఇంత వరకూ ప్రారంభానికి నోచుకోలేదు.

ఈ రెండింటినీ కలిపితే... మొత్తం 36 లక్షల ఇళ్ల పరిస్థితి గందరగోళంలో పడినట్లే! బోగస్ లబ్ధిదారులను గుర్తించేందుకు ఉద్దేశించిన సమగ్ర సర్వే గడువును మార్చి నెలాఖరు వరకు పొడిగించారు. దీనికి సంబంధించిన నివేదికల తయారీ ప్రక్రియ ఏప్రిల్ నెల రెండో వారం వరకు కొనసాగే అవకాశం ఉంది.

ఈ బోగస్ లెక్కలు తేలితేగానీ కొత్త ఇళ్ల మంజూరు కార్యక్రమం ప్రారంభమయ్యే అవకాశం కన్పించడం లేదని అధికార వర్గాలు తెలిపాయి. 2010-11 బడ్జెట్‌లో గృహ నిర్మాణ శాఖకు రూ.1800 కోట్లు మాత్రమే కేటాయించారు. ఈ నిధులు ఇప్పటికే అమలులో ఉన్న ఇళ్ల నిర్మాణానికే సరిపోవని... ఒకవేళ కొత్తవి మంజూరు చేసినా, పనులు ఇప్పట్లో ప్రారంభం అయ్యే అవకాశం లేదని అంటున్నారు.

తెరుచుకోని ఖాతాలు
ప్రస్తుతం ఇందిరమ్మ పథకం కింద 17.32 లక్షల ఇళ్ల పనులు సాగుతున్నాయి. ఇందులో కేవలం ఆరు లక్షల మంది లబ్ధిదారులు మాత్రమే బ్యాంకు లేదా పోస్టాఫీసుల్లో ఖాతాలు తెరిచారు. అంటే, సర్కారు చెబుతున్న దాని ప్రకారం చూసినా చెల్లింపులు కేవలం ఈ ఆరు లక్షల మందికి మాత్రమే పరిమితం అయ్యాయి.

ఖాతాలు తెరవని 11.32 లక్షల మంది లబ్ధిదారులకు చెల్లింపులు ఎక్కడవి అక్కడే నిలిచిపోయాయి. ఇందిరమ్మ లబ్ధిదారుల ఖాతాలు తెరిచేందుకు బ్యాంకులు ముందుకు రావటంలేదని ఆ శాఖ వర్గాలు తెలిపాయి. పాత ఇళ్ల పరిస్థితి ఇలా ఉండగా... ఇందిరమ్మ కింద కొత్త ఇళ్లు మంజూరు చేయాల్సిందిగా గృహ నిర్మాణ శాఖపై ప్రజాప్రతినిధుల నుంచి పెద్ద ఎత్తున ఒత్తిడి వస్తోంది.

Friday, January 22, 2010

1956 నుంచి 2008 సభాపతులు




శ్రీ అయ్యదేవర కాళేశ్వరరావు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ ముట్ట ముదటి స్పీకర్ 1952-12-4౪వ తేదీన ఏకగ్రీవంగా ఎన్నికై 1962-02-26 వరకు పదవిలో ఉన్నారు వీరి హయాంలో ముట్ట ముదటి సారిగా 1960va అఖిల భారత స్పీకర్ల సదస్సు హైదరాబాద్ లో జరిగింది.







Wednesday, June 17, 2009