Wednesday, January 26, 2011
Thursday, January 13, 2011
సంక్రాంతి శుభాకాంక్షలు

తెల్లవారు జాముననే హరిదాసు హరినామ సంకీర్తనలు, సాతాని జియ్యర్లు, జంగపుదేవరలు, బుడబుక్కల దొరలు, పంబలవాండ్లు, బైనాయుడులు, గంగిరెద్దుల వాళ్ళు ఇంటింటికీ తిరుగుతుంటారు. వారి వారి తీరులలో భక్తి గీతాలు పాడుతూ ఏడేడు జన్మలలో మన ఇళ్ల పెద్దలకు పుణ్యలోకాలు ప్రాప్తించాలని దీవెనలు ఇస్తుంటారు. అన్ని కులాల వారు మకర సంక్రమణ సమయంలో తిలా తర్పణలు విడిచి గుమ్మడి పండ్లను దానం ఇస్తే విష్ణువుకు బ్రహ్మాండాన్ని దానమిచ్చిన ఫలం లభిస్తుందని విశ్వాసం. ఈ ఫలం వల్ల పెద్దలు తరిస్తారని పురాణాలు చెబుతున్నాయి. ఆ రోజున తలస్నానము చేసి కొత్త బట్టలను ధరించి, చక్కెర పొంగలి, గారెలు, బూరెలు, పండ్లను నైవేద్యంగా పెట్టి సూర్యభగవానుడిని (శ్రీహరిని), పితృదేవతలను ప్రార్థించుకుంటే మోక్షమార్గము, సుఖసంతోషాలు ప్రాప్తిస్తాయని నమ్మకం. మకర సంక్రాంతి రోజున ఆడపడుచులను, అల్లుళ్లను ఇంటికి ఆహ్వానించి, వారికి కొత్త బట్టలు పెట్టి... బంధుమిత్రులతో కలిసి ఆనందంగా, ఉత్సాహంగా జరుపుకుంటారు. సంక్రాంతి పండుగ సందర్భంగా మహిళలు కొన్ని కొన్ని వ్రతాలను ఆచరించడం చేస్తారు. వాటిలో గొబ్బిగౌరి వ్రతం ఒకటి. ఈ వ్రతాన్ని భోగినాడు ప్రారంభిస్తారు. ధనుర్మాసం నెల పెట్టింది.. మొదలు సంక్రాంతి పండుగ వరకు ప్రతి ఇంటి లోగిలి రకరకాల ముగ్గులతో ముచ్చటగా కనిపిస్తుంది. ఆ ఇంటి ఆడపడుచులు ఆ ముగ్గుల మధ్యన అందంగా గొబ్బిళ్లను తీర్చిదిద్ది, గొబ్బిపాటలు పాడుతూ.. కేరింతలు కొడుతుంటారు.
సంక్రాంతికి ఈ ఏడాది సందడి కరువైంది
సంబరాలు అంబరాన్నంటే... తొలి పండుగ సంక్రాంతికి ఈ ఏడాది సందడి కరువైంది. సంబరాల సంక్రాంతి వచ్చిందంటే..గ్రామాల్లో, పల్లెల్లో, పట్టణాల్లో సందడే సందడి నెలకొంటోంది. ఆనందోత్సాహాలతో తెలుగు ముంగిళ్లు కళకళలా డుతుంటాయి. పల్లెల్లో ఇళ్ల ముంగిట ధాన్య రాశులు...వీధుల్లో రంగ వల్లులతో...పిండి వంటల ఘుమఘుమలు...కొత్త బట్టల మిలమిలలు...తలపించే ఈ పండుగ సందడి ఈ సంవత్సరం కాంతినివ్వడం లేదు. సంక్రాంతి పండుగలో ఆకాశంలో గాలిపటాలను ఎగురవేస్తారు. కానీ ఇప్పుడు గాలిపటాలతో పాటు, నిత్యావసర వస్తువులు, కూరగాయల ధరలు ఆకాశంలో తేలుతున్నాయి. పేద, మధ్య తరగతి కుటుంబాల్లో సంక్రాంతి కళ తప్పింది. రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంటలన్నీ సంక్రాంతి నాటికి ఇళ్లకు చేరుకుంటాయి. ఆ సంబరాన్ని సంక్రాంతి ప్రతిబింభిస్తోంది. కానీ ఈ ఏడాది తొలి పండుగ రైతులను వెక్కిరిస్తోంది. అకాల వర్షంతో పంటంతా తడిసి ముద్దయి ఇంటికి కూడా చేరలేదు. ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల నిత్యావసర, కూరగాయల ధరలు రెండింతలు పెరిగి ప్రజల నడ్డి విరుస్తున్నాయి. పండుగ అంటేనే తీపి, పిండి వంటలు. ఆ వంటకాలు చేసేందుకు ఉపయోగించే నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటడంతో ఆ వంటకాలు చేసుకునేందుకు సామాన్య, మధ్య తరగతి ప్రజలు జంకుతున్నారు. చక్కెర చేదెక్కి, నూనె, నువ్వుల, ఉల్లి, వెల్లుల్లి ధరలు నాలుగింతలు పెరిగి ప్రజల బతుకులను పీల్చి పిప్పి చేస్తున్నాయి.
ఆకాశాన్నంటిన నిత్యావసర ధరలు
నలుగురు ఉన్న కుటుంబంలో గతంలో రూ.500లకు నెలకు సరిపడా సరుకులు వచ్చేవి. కానీ ఆ నలుగురికే ప్రస్తుతం ఆ సరుకులకే రూ.1500లకు పైగా వెచ్చించాల్సి వస్తోంది. జీవనం సాగేందుకు అవసరమైన నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటి సామాన్య, మధ్య తరగతి ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తోంది. మొన్నటి వరకు రూ.18 నుంచి రూ.20 వరకు పలికిన చక్కెర నేడు రూ.35 నుంచి రూ.40లకు చేరింది. ప్రతి కూరలో అవసరమైన ఉల్లి, వెల్లుల్లిలు సామాన్య ప్రజల కంట నుండి నీరు తెప్పిస్తోంది. రూ.20లకు మించని ఉల్లిగడ్డ నేడు రూ.40లకు చేరింది. రూ.40లకు మించని వెల్లుల్లి నేడు రూ.300లకు చేరిందంటే ధరలు ఏ మేరకు పెరిగియో అర్ధం చేసుకోవచ్చు. అన్ని వంటకాల్లో ఉపయోగించే వంట నూనెలు అకస్మాత్తుగా పెరిగిపోయాయి. రూ.60లు దాటని నూనెలు రూ.80ల పైగానే పలుకుతున్నాయి. పిండివంటలకు ఉపయోగించే పప్పుల ధరలు అందనంత దూరంలో ఆకాశాన్నంటాయి. రూ.30లకు మించని కందిపప్పు నేడు రూ.65లకు చేరింది. నువ్వులు రూ.90లకు చేరుకుంది పెరిగిన ధరలతో సంక్రాంతి పండుగకు తయారు చేసుకునే పిండివంటకాలు కరువయ్యాయి. ప్రతి ఇంటిలోనూ ఘుమఘుమలాడే పిండి వంటకాలు ఇప్పటికే తయారు చేసుకోవాల్సినప్పటికీ పెరిగిన ధరలతో దాని జోలికి వెళ్లేందుకే జంకుతున్నారు. పండుగ పూటనే కాస్త నాన్ వెజ్‌తో పూట గడుపుకోవాలనుకునే ఆలోచనలో సామాన్య, మధ్య తరగతి ప్రజలు ఉన్నారు. తొలి పండుగ అయిన సంక్రాంతికి పిండి వంటకాలు లేనట్లే..
దిగి రాని కూరగాయల ధరలు
పెరిగిన కూరగా యల ధరలు సామాన్య, మధ్య తరగతి కుటుంబాలు పచ్చడి మెతుకులతో కాలం వెళ్లదీయాల్సిన పరిస్థితి నెలకొంది. రూ.100 తీసుకెళితే..రెండు రకాల కూరగాయల ధరలు, కరివేపాకు, కొత్తమీర కొనలేక బిక్కముఖంతో ఇంటికి రావాల్సి వస్తోంది. గత నవంబరులో రూ.20లకు మించని కూరగాయల ధరలు నేడు రూ.40లకు తక్కువ కాకుండా ఉండడంతో పేద ప్రజలు లబోదిబోమంటున్నారు. దోసకాయల ధరలు అమాంతంగా పెరిగిపోయాయి. రూ.10లకు మించని దోసకాయ రూ.40లకు తక్కువ కాకుండా మార్కెట్లో అమ్ముతున్నారు. చిక్కుడుకాయ రూ.60, బెండకాయ రూ.40, టమా టా రూ.30, బీరకాయ రూ.45, ఉల్లి రూ.40 పలుకుతోంది. కోడిగు డ్డు విషయానికొస్తే ఒకటి రూ.3.50 చొప్పున విక్రయిస్తున్నారు. ఆకు కూరలకు వెళితే...రూ.10లకు రెండు కట్టలు కూడా ఇవ్వడం లేదు.
ఇంటికి చేరని ధాన్యపు సిరులు :
కొత్త సంవత్సరం తొలి పండుగ అయిన సంక్రాంతికి ధాన్యపు సిరులు ఇంటికొస్తాయి. కానీ అకాల వర్షాల మూలంగా పండుగకు ధాన్యపు సిరులు ఇంటికి రాకుండా పోయాయి. కోసిన మెదలు, కల్లాల్లో వచ్చిన రాసులు వర్షాల బారిన పడి తడిసి ముద్దయి నాశనమైపోయాయి. పంటంతా వర్షం పాలు కావడంతో మిగిలిన పంటను ఆరుమూరుకు అమ్ముకున్నారు. దీంతో పొలం నుండి నేరుగా ఇంటికొచ్చే ధాన్యపు సిరులు నేరుగా మార్కెట్‌కు వెళ్లిపోయాయి. రైతన్నల్లో సంక్రాంతి సంతోషాన్నివ్వలేదు. కుటుంబ సభ్యులతో కళకళలాడే ఇళ్లన్నీ..బోసిపోతున్నాయి.
Thursday, October 14, 2010
నిత్యజీవితంలో అనుభవిస్తున్న సత్యం
తప్పు - శిక్ష వేయవచ్చు!
పేదవాని తప్పు ఔదార్య
హృదితోడ సైపవలయు మనుజ సంఘమెల్ల!
ఈ ఆణిముత్యం కీ.శే. నండూరి రామకృష్ణమాచార్య కలం నుండి జాలువారినది.విద్యావంతుడు, ధనవంతుడు చేసే తప్పు తెలిసి.. తెలిసి చేసే తప్పు. పైగా నన్నెవడు అడిగేవాడు? అన్న అహంకారంతో చేసేది. కాబట్టి అది క్షమార్హం కాదు. కానీ ... పేదవాడు చేసే తప్పు, వాడు చేసేది కాదు. వాని ఆర్థిక స్థితి గతులు వానితో తప్పును చేయిస్తాయి. కాబట్టి ఆ ఆర్థిక అసమానతలకు మూల కారణమైన సంఘానిదే ఆ తప్పు. అందుకే అది శిక్షార్హం కాదు. ఆ తప్పును మనుజ సంఘం తనదిగా భావించి, భరించాలంటారు కవి.సరళ సుందరంగా, అభ్యుదయాత్మక సందేశం ఇమిడిన ఇలాంటి పద్యాలే మా ఆధునిక వేమనగా మన్ననలందుకొనేందుకు దోహదపడ్డాయని నా భావన!
నిత్యజీవితంలో అనుభవిస్తున్న సత్యం
ఒక రోజు హాలియా మండల పరిధిలోని రాజవరం గ్రామం పంచాయతీ పరిధిలో జరిగిన సంఘటన గురించి ప్రత్యర్ధిపై కేసు పెట్టారు. అతన్ని పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చిన అసలు గోడవ జరగడానికి కారణం ఎమిటి? అని ఎస్‌ఐ అడిగాడు దానికి బాధితుడు చెప్పిన వివరాలను సబ్ ఇన్‌స్పెక్టర్ మహా శ్రద్దగా, సంతోషంగా విన్నాడు. నింధితుడు తమ కుటుంబ కష్టాలు చెప్పుకుంటూంటే అంతరంగిక సేవకులు అలాగే వింటారు. తన కష్టలను చెప్పిన బాధితుడిని బయట కూర్చో మని చెపిప కానిస్టేబుల్‌ను లోపలి పిలిచి ఈ విధంగా చెప్పడం మొదలు పెట్టాడు ఎస్‌ఐ. ఇప్పుడు విను ఆ ఆరుగురిని ఆ రోజు ముందు తగవుకి తగిన ఒకరిని పిల్చి ఎంక్వరీ జరుపుతాను. ఈ క్వయిరీలో ఆ ఆరుగురిది తప్పేమీ లేదని తెలుతుంది. అర్ధమయిందా... వాళ్లకి నచ్చచెప్పు నేనిక్కడ ఒకన్ని పట్టుకుంటాను సారేనా? అని ఎస్‌ఐ పీసీను ఆదేశించారు. అది కూదరదు అని ప్రతిఘటిస్తే పోలీసులచే దాడి చేసియించి అమానుషంగా విచక్టణారహితంగా అందరినీ కొట్టి, గాయ పరచినట్టు, లాఠీలు చేసి మహిళలను అవమానించి ఆ వీధిలో మరికొందరన్ని బెదిరించి వాళ్లచే విర్యాదు తీసుకొని మనం దానికి బదులుగా చేయగలిగింది నేన్చెప్పిందే ఆరు మందిని వదిలేస్తే చాలు వాళు్ల మనకు ఎంతో కొంత ఒప్పచెబుతారు. ఇక్కడ వాళ్లపై ఒత్తిడి చేయండి. తట్టుకోవడం కష్టం అని భావించి లొంగిపోగతప్పదు. సరే ఆల్‌రైట్ నేను మళ్లీ ఉదయం ఫోన్ చేస్తాను. ఉదయాని కల్లా ఈ దంపతుల మీద కేసు నమోదు చేసి వాన్ని జేల్లో ఉంచాలి. అవసరం అయితే ఆ ఆరుగురితో మాట్లాడు. కానీ దంపతులు డీమోరరైజ్ అవుతారేమో...అవకూడదు. అవకుండ చూసే బాధ్యత నీధి. ఈ డ్రామా చెయ్యకపోతే డబ్బులు ఇచ్చిన వారువూరుకోరు. జ్యూడీషియల్ ఎంక్వరీ వరకు వెళ్లేలాగుంది. వెళినా మనకే భయం లేదనుకో, కానీ రొష్టూ బురదానూ... ఐడోంట్ వాంట్ దట్ అన్నారు ఎస్‌ఐ.కాదు సార్ నాకు విర్యాదు అందిన తరువాత చేస్తేనే బాగుంటుంది. కాదా?అవసరం లేదు. నేను ఆవీషయల్‌గా ఆ విర్యాదు అందుకున్నాను. నేను దర్యాప్తు చేయమని నీకు ఆర్డర్‌స కూడా పంపుతాను. సారేనా.సరే సార్ అంటూ బయటకు వచ్చిన కానిస్టేబుల్ తనకు ఏం చేయలో తోచక ఇదే విధంగా ఆలోచిస్తూనే బలుదేరారు. దంపతుల మీద కేసు నమోదు చేసి వాళ్లను సాయంత్రానికి మిర్యాలగూడలో ఉన్న కోర్టుకు తీసుకేళ్లారు అక్కడ కోర్టు సమయం ముగియడంతో వాళ్లను తిరిగి హాలియా పోలీస్‌ట స్టేషన్‌కు తీసుకేళ్లారు. హాలియా నుండి మిర్యాలగూడ, మిర్యాలగూడ నుండి హాలియకు దారి ఖర్చులని వాళ్ల దగ్గర నుండి పోలీసులు రూ.3000 తీసుకున్నారు. రాత్రి భోజనం తీసుకొస్తానని చెప్పి రూ.500 తీసుకేళ్లిన కానిస్టేబుల్ వాళ్లకు తిరిగి చిల్లర ఇవ్వక పోగా మారి నాకు భోజనం కావాలి మీ దగ్గర ఏమైన డబ్బులు ఉంటే ఇవ్వండి అని అడగడం మొదలు పెట్టారు. లేదని చెబితే మీతో పాటు ఉదయం నుండి సాయంత్రం దాకా తీరిగాం, మీ వాళ్ల ఇవ్వాళ్ల మాకు వచ్చే దసార మమూళు్ల కూడా రాలేదు. ఇప్పుడు నువు్వ డబ్బులు లేవు అని చెబుతున్నావు. ఎందుకు వస్తారు రా...! నీవు పోలీస్టేషన్‌కు. పోలీస్టేషన్‌కు వచ్చే ముందు డబ్బులు జేబులో పెట్టుకోవడం వచ్చిపోయావా? లేదా నాటకలు అడుతున్నావా...! అని బెదరించడం చేశారు. వాళు్ల మా దగ్గర వసూలు చేశారు. వాళు్ల ఈ విధంగా వాళు్ల ఇబ్బందులు పడుతుంటే పోలీసులక తోడు గ్రామ రాజవరం విఆర్‌ఓ కూడా వీరి మరో ఇబ్బందిలో ఇరియించారు. మీరు ఈ కేసు నుండి బయట పడాలంటే నేను చెప్పినట్టు చేయాండి అని ఉచిత సలహ ఇచ్చి వాళ్ల దగ్గర రూ.2000 తీసుకొని వెళ్లిపోయ్యాడు. నేను ఎస్ ఐతో మాట్లాడి మీ మీద కేసు లేకుండా చేస్తానుఅని నమ్మబలికాడు. కనీసం రెండు రోజులైన ఆ వీఆర్‌ఓ తీరిగి ఊరిలో రాలేదు. ఈ విధంగా ప్రభుత్వ ఉద్యోగులు అమయక గిరిజనులను వాళ్లకు ఉన్న దొంగ బుద్దలతో చేతికి, అవినీతికి పాల్పడుతున్న అధికారులపై ఎలాంటి చర్యలు ఉండావు. ఎవరైన పై అధికారులకు విర్యాదు చేయడానికి వేళితే వాళు్ల హేలన చేసి మాట్లాడుతారు. వీరి బాధలు ఎవరితో చేప్పుకోవాలో వాళ్లకు అర్ధం కాక అక్రమా కేసుల బారిన పడి బలైపోతున్నారు.కనీసం ఇలా అయినా ప్రజలకి ఈ కేసు గురించి అమాయకుడైన గిరిజనుల గురించి తెలిసింది కదా. అయితే వాళ్ళు దీన్ని ఎంతసేపు గుర్తుంచు కొంటారన్నది వేరే విషయం. కొంతమంది స్పందించి వాళ్ల ఆర్ధిక సాయం అందించడానికి ముందువాస్తరా? ఆ దంపతులు దోషి అనే చెప్పే సాక్షాలే లేవు.. ఇది ఎవర్నో కాపాడడానికి పాపం అమాయకులను బలి చేసారు.. ఈ పోలీస్టేషన్ పరిధిలో ఇలాంటివి చాల జరిగాయి.. వీరి శాపాలు ఊరికే పోవు.. తగుల్తాయ..ఖచ్చితంగా పోలీసులకు తగులుతాయి. వాళు్ల ఏ ఎన్‌కౌంటర్లో... లేద వాళ్ల పిల్లలు ఆనరోగ్యానికి గురై సంతన శోభం మిగులుతుంది.
(ఈ కథ నల్గొండ జిల్లా, హాలియా మండలంలో జరిగి సంఘటన)
Tuesday, September 21, 2010
కాశ్మీర్‌లో విన్యాసం చేస్తున్న డ్రాగన్
భారతదేశంలో అనేక కులాలు, మతాలు ఉన్నాయి. వాటిని అసర చేసుకొని పోరుగు దేశం మాతాల పేరుతో దేశంలో ప్రవేశిచించి దేశాన్ని క్రమంగా అక్రమిచుకునే మార్గాలను ఎంచుకుంది. అదే క్రమంలో చైనా దలైలామ పేరుతో భారతదేశం మొత్తం విసృత ప్రచారంలో ఉంది. అయితే మొదటి ఆక్రమితంలో భాగంగా కాశ్మీర్‌ను ఎంచుకుంది. కాశ్మీరలో కొంత భాగాన్ని డ్రాగన్ (చైనా) సైనికులు అక్రమించుకుని పాలకు సిద్దమౌతున్నారు. ఈ విషయాన్ని 1950 ప్రారంభం నుంచే నెహ్రూ చైనా నుంచి ముప్పును ఊమించారనడానికి ఇప్పుడు కావలసినన్ని సాక్షాలున్నాయి. చైనా నుంచి ఎదురుకాగల ప్రమాదం గురించి తాము నెహ్రూను హెచ్చరిస్తూనే వచ్చామని ఆయన సకాలంలో చర్య తీసుకోలేదని కొందరు నాయకులు చెప్పుకున్నారు. పండిట నెహ్రూ 1952లో తన పెంకింగ్ పర్యటన సందర్భంగా ఇలా అన్నారట. ఏదో ఒక రోజున ఈ రెండు ఆసియా మహాకాయాలూ ఒక దానితో
ఒకటి ఘర్షణకు దిగుతాయి. అది ఆసియాకే మహోత్పాతంగా విప్లవానంతరం నవచైనా ఎలా మారబోతోందో మనం దృష్టిలో ఉంచుకోవాలని 1950 నవంబర్ 27వ తేదీన నెహ్రూ పార్లమెంటులో ప్రకటించారు. ఆ తరువాత 1950లో నియుక్తమైన భార్డర్ కమిటీని గురించి ప్రస్తావించి శక్తివంతమైన ఈ రెండు దేశాలు సరిహద్దు వివాదాన్ని పురస్కరించుకొని ముఖాముఖిగా రూపొందించుకున్న చిత్రం 1950 నుంచి ప్రబుత్వం ముందు ఉంటూనే వచ్చిందనీ, అయితే, ఘర్షణ అయిదేళ్లలోనా, ముపై్పళ్లోనా అన్న విషయం కాక ఎప్పుడు సంభవిస్తుందనే విషయంలో రెండు దేశాల మద్య అభిప్రాయభేదం ఉండవచ్చునని అన్నారు. మాజీ ప్రధాని పండితుడు సర్గీయ పి.వి.నరసింహారావు లోపల మనిషి పుస్తకంలో రాసిన మాటలివి. చైనా-భారత్ సంబంధాలు ఎలా ఉండబోతున్నాయో ప్రథమ ప్రధాని నెహ్రూ వేసిన అంచనా అక్టరం కూడా తప్పలేదు. ఆయన చెప్పినట్టే అసియాలోని ఆ రెండు మహాకాయాలు 1962లో తలపడ్డాయి. కూడా ఎటోచ్చి అపజయం మనదే అయింది. ``1947-64 మధ్యకాలంలో ప్రపంచదేశాల మధ్య సమున్నత స్థాయికి ఎదిగిన భారతదేశం ప్రతిష్ట 1962 నాటి సైనిక పరాజయంతో దారుణంగా కుంగిపోయింది ఇది కూడా పివి రాశాని మాటాలే... పోయిన ప్రతిష్టను భారత్ తిరిగి సాధించుకుంది. కానీ, చైనాతో మన సంబంధాలు మెరుగుపడలేదు. చైనా విస్తరణ కాంక్టలో మార్పుకనిపించడం లేదు. ఇందుకు తాజా ఉదాహరణ ఆక్రమిత కాశ్మీర్‌లో ఇటీవల జరిగిన పరిణామాలు. ఉత్తర ప్రాంతాలుగా పిలుచుకునే గిల్గిత్, బాల్టిస్థాన్‌లలో చైనా సేనలు వచ్చి చేరుతున్నామనీ, ఆక్రమిత కాశ్మీర్‌ను చైనాకు అప్పగించడానికి పాకిస్థాన్ సిద్దపడుతున్నదనీ వివరిస్తూ విదేశీ మీడియా కొన్ని వార్తలు ఇచ్చింది. ఈ అంశంతో సంబంధం ఉన్న భారత్-చైనా-పాకిస్థాన్ ఈ మూడు దేశాలలో ఏ ఒక్కటీ ఈ అంశం మీద ఇంత వరకూ నోరు మెదపలేదు. కాబట్టి దీని గురించి వెంటనే నిర్ధారణకు రానవసరం లేదని కొందరు వాదిస్తున్నారు. అలాంటి వారి కోసమే పివి రాసిన మాటలు గుర్తు చేయడం. ఇంతకీ తాజా వివాదం ఏమిటి? భారత ప్రభుత్వం కూడా ఈ సంగతుల రుజువు కోసం ఎందుకు చూస్తున్నది. అదొక విచిత్రమే... ఈ సందర్భంలో కార్గిల్ ప్రాంతంలో జిరగిన ఆక్రమణలను అక్కడ పశువుల కాపరులు సైనాన్యనికి తెలియ చేస్తే గానీ భారత ప్రభుత్వం దృష్టికి రాలేదన్న సంగతి గుర్తుకు వస్తుంది.జమూ్మకాశ్మీర్‌లో విధులలో ఉన్న సైనికాధికారి, ఉత్తర కమాండ్ అధిపతి లెవి్టనెంట్ కల్నల్ బి.స్ జస్వాల్ ఉదంతం ద్వారా చైనా ఉద్ధేవాలను పసిగట్టవచ్చుననే అనిపిస్తుంది. జస్వాల్ ఆ దేశంలో పర్యటించేందుకు మీసా నిరాకరించింది. అందుకు చైనా చెపిపన కారణం కొత్తదేమీ కాదు. భారతీయులను విభ్రాంతికి గురిచేసేది కాదు. సరిహద్దులలో పరిణామాలు. 1949 నుంచి జరిగిన చరిత్ర పరిణామాల గురించి లోతుగా తెలిసిన వారికి ఇవన్నీ పెద్ద విస్మయం కలిగించేవి కావు. ఎందుకంటే అరుణాచల్ ప్రదేశ్ విషయంలో చైనాలో పన్నుతున్న వూ్యహాలేవి కొత్తవి కావు. కల్నల్ జస్వాల్ మొన్న జూలైలో చైనాలో పర్యటించవలసి ఉంది. జస్వాల్ పర్యటనను అనుమతించడం సాధ్యం కాదని జూలై మధ్యలో ఛైనా అధికారులు కబురందించారు. కారణం-వ్యవస్థాపరంగా చైనాకు ఇబ్బంది కారకంగా ఉన్న ప్రాంతంలో జస్వాల్ పని చేస్తున్నందుకే ఈ నిర్ణయం అనివార్యమైందని దౌత్యభాష పలికింది. చైనా కల్నల్ జస్వాల్ అధికార పరిధి కాశ్మీర్‌లో సున్నిత ప్రాంతాలకు చెందిన వారికి చైనా ప్రభుత్వం ప్రత్యేక వీసాలు జారీ చేస్తుందని జూలై 21న భారత అధికారులకు రాసిన లేఖలో ఆ దేశ అధికారులు పేర్కొన్నారు. నిజానికి కాశ్మీరీలకు చైనాకు మన అధికారులు నిరసన తెలియజేశారు. దానితో పాటు వేగంగా ప్రతిఘటన తెలిపింది. ఆగస్టులో భారత్ పర్యటనకు రావలసిన చైనా సీనియర్ కల్నల్, ఇద్దరు కెప్టెన్ల పర్యటనను రద్దు చేయడం ఆ ప్రతిఘటనలో భాగమే. చైనా కల్నల్ న్యూఢిల్లీలోని నేషనల్ డిఫెన్‌స కాలేజిలో ప్రత్యేకోపన్యాసం ఇవ్వవలసి ఉంది. ఆయన వెంట ఇండియా పర్యటించవలసిన కెప్టెన్లు కూడా పంచమడిలోని సైనిక కేంద్రంలో శిక్టణ కార్యక్రమంలో పాల్గొనవలసి ఉంది. ఈ ద్వంద్వ వీసాల వివాదం తేలే దాకా రక్టణకు సంబంధించి ఇచ్చిపుచ్చుకునే కార్యకలాపాలను నిలిపివేయాలని తీసుకున్న తీవ్ర నిర్ణయం కూడా అందుకే.
చైనా టిబెట్‌కు విజయవంతంగా రైలు మార్గాన్ని నిర్మించింది. ఇప్పుడు గిల్గిత్-బాల్టిస్థాణతో పాకిస్థాన్‌కు తలనొప్పులు ఉన్నాయి. వాటిని వదుల్చుకోవడానికి కూడా చైనా ప్రమేయాన్ని పాక్ వాంఛిస్తున్నది. అదే చైనా కోణం నుంచి చూస్తే భారత్ సరిహద్దులో కీలకమైన ప్రాంతాన్ని తమ అధీనంలోకి తెచ్చుకోవడం, ఆసియాలో రెండో అతిపెద్ద దేశమైన భారత్ చుట్టూ తన ప్రాబల్యం బలపడడం దానికి ఎంతో సంతృప్తిని ఇచ్చే అంశమే. ఈ ప్రాంతలో చైనా అభివృద్ధి పథకాలు చేపట్టడంతో దాని మీద పట్టు కోసం ముందు పోటీ ఏర్పడడమూ ఖాయం. కాబట్టి కల్నల్ జస్వాల్‌కు వీసా నిరాకరించడం ఈ ప్రాంతంతో చైనా వేస్తున్న ఎత్తులలో భాగమే అని అర్ధం. అక్కడ పని చేస్తున్న భారత సైనికాధికారికి వీసా నిరాకరించడం అంటే సున్నిత కాశ్మీర్‌లో భారత్ అధిపత్యాన్ని ప్రశ్నార్ధకం చేయడమే. టిబెట్ తిరుగుబాటు(1959) తరువాత దాని మీద చైనా అధిపత్యాన్ని ప్రశ్నార్ధకం చేయాలని భారత్ ప్రయత్నించినట్లు, చైనా అనుమానం. దలైలామాకు ధర్మశాలలో ఆశ్రమాలనికి, ప్రవాస ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతి నివ్వడం చైనాకు ఇప్పటికీ రుచించని విషయమే. ఆ క్రమంలోనే కాశ్మీర్ మీద భారత్‌సార్వభౌమత్వాన్ని ప్రశ్నార్ధకం చేయడానికి వచ్చిన ప్రతి అవకాశాన్ని చైనా కూడా వినియోగించుకుంటున్నది. ఇందుకు పాక్ పెద్దపావులగా ఉపయోగపడుతున్నది.చైనా వైఖరికి దాని విదేశాంగ నీతే కారణం. వాస్తవం చెప్పాలంటే చైనా విదేశ వ్యవహారాలు వన్‌వే ట్రావిక్‌ను మరిపిస్తాయి. చైనా ప్రయోజనాలకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వడమే తప్ప అవతలి భాగస్వామి అభిప్రాయాలకు ఆ విధానంలో గౌరవం తక్కువ. ఇది పంచశీల భగ్నమైనప్పుడే స్పష్టంగా అర్ధమైంది. కానీ, భారత్‌కు విదేశీ వ్యవహారాలకు సంబంధించి స్పష్టమైన సంప్రదాయాలు ఉన్నాయి. ఏ రాజ్యకూటమికి చెందకపోవటం అందులో ప్రధానమైనది. అందుకే ప్రచ్ఛన్నయుద్దంలో ఇటు కమూ్యనిస్టు, బ్లాకు వైపుగానీ, అటు అమెరికా వైపుగానీ దేశం మొగ్గుచూపలేదు. ప్రచ్ఛన్న యుద్దం అంతం తరువాత ఈ విషయం స్పష్టంగా అర్ధం అవుతోంది. కానీ, ఈ విధానంతో మనకు మేలు జరగలేదని చెప్పడం తొందరపాటే కాదు, కొంత నష్టం కూడా తెచ్చిందని చెప్పడానికి మాత్రం వెనుకాడనక్కరలేదు.
దౌత్యం అంటే భారత్‌కు ఏమాత్రం గౌరవం లేని ఇరుగు పోరుగుతో కాలం చెల్లిన దౌత్య వూ్యహాలను అమలు చేయడానికి ప్రయత్నించే దేశంగా భారత్ మీద ముద్ర పడింది. పాకిస్థాన్ విదేశాంగ విధానంలో భారతదేశానికి చాలా ప్రతికూలంగా వ్యవహరిస్తూ ఉంటాయి. భారత సరిహద్దు ప్రాంతాల మీద చైనాకూ, పాక్‌కూ కూడా కన్ను ఉంది. రెండూ కూడా కవ్వింపు చర్యలకు పాల్పడుతూ ఉంటాయి. భారత ఉత్తర సరిహద్దులలో పాకిస్థాన్ తన ఆర్ధిక, వూ్యహాత్యక అవసరాల దృష్టా్య స్థావరాల కోసం అర్రులు చాస్తూ ఉంటుంది. అయితే పాక్ కంటె చైనా విషయంలో ఇందుకు సంబంధించిన భారత్ స్పందన ఎప్పుడూ ఎంతో బలహీనంగా పేలవంగా ఉంది. కానీ, దీని వెనుక ఉన్న చారిత్రక కారణాలను అర్ధం చేసుకోవడం కూడా ఆయా ప్రాంతాలలో ఇప్పుడు ఏ జరుగుతున్నదో తెలసుకునే ఆసక్తిని ఇండియా ఏనాడూ కనపరచలేదు. గిల్గిత్-బాల్టిస్థాన్ సాధికారత, 2009 నాటి స్వయం పాలన ఉత్తర్వు వంటి రాజకీయ ప్యాకేజి గురించి కూడా భారత్ ప్రభుత్వం పట్టించుకోలేదు. ఇందులో భారత్‌కు సానుకూల పరిణామాలు ఉన్నాయి. అయినా భారత్ శ్రద్ద వహించలేదు. గిల్గత్-బాల్టిస్థాన్‌ల సాధికారతకు జమూ్మకాశ్మీర్‌లో అన్ని వైపుల నుంచి వ్యతిరేకత వ్యక్తమైంది. కాశ్మీర్‌కు స్వతం6తం కోరుతున్న జమూ్మకాశ్మీర్ ! లిబరేషన్ ప్రంట్ వంటి సంస్థలు, పాకిస్థాన్‌లో విలీనం వైపు మొగ్గు చూపుతున్న హిజ్బుల్‌ముజామిదీన్ ఇస్తాం వంటి సంస్థలు కూడా ఈ ప్యాకేజీకి ప్రతికూలంగా ఉన్నాయి. పాకిస్థాన్‌లో నవాజ్ షరీఫ్ నాయకత్వంలోని ముస్లిం లీగ్ కూడా ఈ ప్యాకేజీ నిర్ణయానికి వ్యతిరేకత వ్యక్తం చేసింది. ఉత్తర ప్రాంతాలకు సంబంధించి (అవేగిల్గిత్-బాల్టిస్థాన్) ఏ నిర్ణయం తీసుకోవాలన్న పాకిస్థాన్ ప్రధాని యూసఫ్ రజాగిలానీ కూడా నేషనల్ అసెంబ్లీని సంప్రదించవలసి ఉంటుంది.
జమూ్మ కాశ్మీర్ లిబిరేషన్ ఫ్రంట్ నాయకుడు అమానుల్లా ఖాన్ ఒక సందర్భంలో మాట్లాడుతూ ఉత్తర ప్రాంతం జమూ్మకాశ్మీర్‌లో అంతర్భాగంగా ఉండాలని చాలా చట్ట బద్దంగా మాట్లాడాడు. అంటే ఇప్పుడు అన్ని ఉన్న ఆక్రమిత కాశ్మీర్‌లోనే అవి కొనసాగాలి. ఇక్కడ ఒక విషయం గమనించాలి. అమానుల్లా ఖాణ్ గల్గిత్‌కు చెందినవాడు. సరిహద్దు ఉత్తర ప్రాంతాల పరిపాలన జమూ్మ-కాశ్మీర్ ప్రాంతాలు ఐక్యంగా ఉండటం అనే అంశాల మీద విభజన కాలం నుంచే భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. అవి ఈ నాటివి కావు. 1 ఆగస్టు 1947న గాంధీ శ్రీనగర్ వచ్చారు. నాటి బ్రిటిష్ ఇండియాలోని మిగిలిన భారతదేశమంతా మత కల్లోలాలతో అట్టుడుకుతున్నట్లు ఉండగా కాశ్మీర్‌లో స్వాతంత్య్రం దినోత్సవాలకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. గాంధీజీ దానికి ఇచ్చిన నిర్వచనం వేరుగా ఉంది. 12 సంవత్సరాల తరువాత గిల్గిత్ ఏజెన్సీ తిరిగి కాశ్మీర్‌లో చేరినందుకే వారు ఈ ఉత్సవాలు జరుపుకుంటున్నారని గాంధీ చెప్పారు. ఇదే కీలకమైన పరిణామం. గిల్గిత్‌పై 60 సంవత్సరాల అధికారం వెలుగబెట్టడదనికి ఉద్ధేశించిన ఒక ఒప్పందం మీద 1935లో మహారాజా హరిసింగ్(కరణ్‌సింగ్ తండ్రి), బ్రిటిష్ ఇండియా ప్రభుత్వం సంతకాలు చేశాయి. ఆ ప్రాంతంలో పెరుగుతున్న రష్యా ప్రభావానికి గండి కొట్టడానికి బ్రిటిష్ ఇండియా ప్రభుత్వం ఆ ప్రాంతాన్ని సరిహద్దు రక్టణరేఖగా ఉపయోగించదలిచింది. అయితే 1947లో బ్రిటిష్ పాలన అంతంకావడంతో ఈ ఒప్పందం రద్దయింది. ఆ సందర్భంలోనే గాంధీజీ మరొక ప్రకటన చేశారు. జమూ్మకాశ్మీర్ రాష్‌ట్రం సమైక్యంగా ఉండేందుకు వీలుగా గిల్గిత్‌ను స్థానిక ప్రజలకు ఇచ్చి స్వయం ప్రతిపత్తి కల్పించాలనీ, తద్వారా అక్కడి సంప్రదాయాలనూ, సంస్కృతినీ రక్షించాలనీ ఆయన అన్నారు. కానీ, గాంధీజీ మాటలను రాజా హరిసింగ్ పరిగణలోకి తీసుకోలేదు. తన సైనికాధికారి బ్రిగేడియర్ ఘనసారా సింగ్‌ను ఆ ప్రాంత గవర్నర్‌గా నియమించారు. కానీ, కొద్ది రోజులకే తిరుగుబాటు చెలరేగింది. గవర్నర్‌ను అరెస్టు చేశారు. అక్కడి చైనిక విభాగాధిపతి మేజర్ స్కాట్ తిరుగుబాటుదారుల పక్టం వహించాడు. ఆ ప్రాంతానికి 1 నవంబర్1948 నుంచి పాకిస్థాన్ వాస్తవిక పాలకురాలైంది. 1949లోనే మళ్లీ ప్రభుత్వానికీ, దాని ఆధీనంలో న్న ఆక్రమిత కాశ్మీర్ పాలకుల మధ్య ఒక ఒప్పందం కుదిరింది. దీని మేరకు ఉత్తర ప్రాంతాల మీద అధికారం పాకిస్థాన్ పరమైంది. రాష్ర్టం నుంచి ఆ విధంగా ఉత్తర ప్రాంతం వేరైంది. ఈ ప్రాంతానికి ఆప్ఘానిస్థాన్, చైనా, భారత్ ఆధీనంలో ఉనన కార్గిల్ సరిహద్దులుగా ఉన్నాయి.
చైనాతో లాభకమైన సంబంధాలకు ఈ ప్రాంతం మీద అధిపత్యం కలిగి ఉండడం పాకిస్థాన్‌కు అవసరం. అయితే చైన వైరం భిన్నమైనదని అంగీకరిస్తూనే మనకు శత్రువులుగా ఉన్న మన రెండు పోరుగు దేశాల మధ్య పెరుగుతున్న స్నేహం, ఫలితంగా ముందు ముందు తలెత్తే క్లిష్టపరిస్థితి దానితో మన ప్రయోజనాలకు కలిగే విఘాతం గురించిన సమస్య అన్ని గుర్తుంచుకోవాలి. 2మార్చి 1963న చైనా-పాక్‌ల మధ్య జరిగిన ఒప్పందం ఈ ప్రాంతంలో 2700 చదరపు కిలోమీటర్ల భూబాగాన్ని చైనాకు అప్పగించడానికి మార్గం ఏర్పరచింది. 1982లో పాకిస్థాన్, చైనా ఉమ్మడిగా కారాకోరమ్ జాతీయ దరహదారిని నిర్మించారు. ఈ రహదారి పోడవు 900 కిలోమీటర్లు కావడం వల్ల మధ్యలో పంజాబ్‌లో సారవంతమైన పంజాబ్ ప్రాంతం సరిహద్దుకు , చైనాలోని జియాంగ్ ప్రాంతానికి లంకె ఏర్పడింది. ఇది రెండు దేశాల ఆర్ధిక పరిపుష్టికే కాక, స్నేహం పెంపొందడానికి కూడా దోహదం చేసింది. అలాగే జియాంగ్ ప్రాంతంలో నివసించే యుఫర్ జాతీయులకు, కాశ్మీర్ ఉత్తర సరిహద్దు ప్రాంత ప్రజలకు మధ్య స్నేహ సంబంధాలకు కూడా ఈ రహదారి కారణమైంది. ఈ జాతీయ రహదారి కారణంగానే పాకిస్థాన్‌లోని బలూచిస్థాన్ వద్ద గ్వదాల్ నౌకశ్రయం నిర్మాణం సాధ్యమైంది. ఈ నౌకాశ్రయాన్ని కూడా పాకిస్థాన్ చైనా ఇంజనీర్లే కలిసి నిర్మించారు. అరేబియా సముద్ర తీరంలో ఏర్పాటైన ఈ నౌకాశ్రయం వల్ల పశ్చిమ చైనా సముద్రమార్గంతో అనుసంధానమైంది. ఆవ్రికా నుంచి ముడి సరుకును దిగుమతి చేసుకోవడానికి కూడా చైనాకు ఈ నౌకాశ్రయం దోహద చేస్తున్నది. గల్‌ఫకు చేరడం కూడా చైనాకు సులభమవుతోంది. మొత్తంగా చూస్తే ఈ ప్రాంతంలో చైనా తన అధిపత్యాన్ని సుదూరంగా విస్తరిస్తున్న విషయం అర్ధమవుతుంది. ఆఖరికి శ్రీలంకలో కూడా ఒక నౌకాశ్రయాన్ని నిర్మించాలని అది ప్రణాళికలు వేసుకుంటోంది. అక్కడితో చైన విస్తరణ కాంక్ట అగిపోలేదు.ఏమైనా ఆక్రమిత కాశ్మీర్‌లో చైనా సైన్యం ప్రవేశం ఆసియాకే పెద్ద సమస్య దీనిని ప్రపంచ, ఐక్యరాజ్య సమితి ఎంత తొందరగా గుర్తిస్తే అత మంచిది. ఇప్పటికే ప్రచ్చన్నయుద్దం మిగిల్చిన విషాదంతో ఆసియా అల్లకల్లోమైంది. ఇప్పుడు చైనా దుడుకుతనం దానిని మరింత తీవ్రం చేస్తుంది.
Sunday, September 12, 2010
దేవాలయ భూముల విక్రయ కుంభకోణం

దేవాలయ భూముల విక్రయ కుంభకోణం రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తోంది. ఇది బీహార్‌లో పశుగ్రాస కుంభకోణాన్ని మించిన అవినీతిపర్వంగా రూపుదాల్చింది. అటు రాష్ట్ర ప్రభుత్వం, ఇటు కాంగ్రెస్ పార్టీ అవినీతి ఊబిలో పూర్తిగా ఇరుక్కుపోయాయి. ముఖ్యమంత్రి, మంత్రులు, అధికారపార్టీ శాసనసభ్యులతోపాటు సీనియర్ ఉన్నతాధికారుల ప్రమేయం సైతం ఇందులో వినిపిస్తోంది. పట్టణ ప్రాంతాలలోని సుమారు 400 ఎకరాల ఆలయ మాన్యాలు అధికారపక్ష అవినీతివల్ల అన్యాక్రాంతం అయిపోయాయి. వీటి విలువ కొన్ని వందల కోట్ల రూపాయల మేరకు ఉంటుందని అంచనా. ఈ అవినీతి బండారం బయటపడినప్పటి నుంచి రోజుకో కొత్త విషయం బయటకు వస్తోంది. తవ్వినకొద్దీ అక్రమాలు కొత్తకొత్తవి వెలుగులోకి వస్తున్నాయి.
ఈ భూముల కుంభకోణం చిలికి చిలికి గాలివాన అయినట్లు మొత్తం ప్రభుత్వాన్ని, పాలకపక్షాన్ని వివాదపు రొంపిలోకి నెట్టేసింది. ఏతావాతా అనుమానాలు, సందేహాలు అంతకంతకూ పెరిగి ఆరోపణల అస్త్రాలు ముఖ్యమంత్రిపైకే సంధించే పరిస్థితి నెలకొంది. ఈ పరిస్థితిని సరిదిద్దాలంటే ప్రభుత్వం సవ్యంగా మెలగడంతోపాటు అందుకవసరమైన నమ్మకాన్ని కూడా కలిగించాలి. ప్రభుత్వాధినేత వేసే ప్రతి అడుగు, చేసే ప్రతి నిర్ణయం ప్రభుత్వ విశ్వసనీయత పెంచేదిగా ఉండాలి. ఈ విజ్ఞత ముఖ్యమంత్రిలో లోపించటం దురదృష్టకరం. మంత్రి సత్యనారాయణరావు తాను ఈ కుంభకోణానికి అతీతుడు అంటూ మాట్లాడుతున్నారు.
అవినీతి, ఊటలు దిగిన మర్రి వృక్షంలా పాతుకుపోయినా మాకేం తెలియదని కాంగ్రెస్ నేతలు నమ్మబలుకుతున్నారు. ఇంటి దొంగల్ని ఈశ్వరుడు కూడా పట్టలేడన్న నానుడిని కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా ఒంటపట్టించుకొన్నట్లుంది. అందుకే దేవాదాయ భూముల కుంభకోణంలో పాత్రధారులుగా అనుమానితులైన పెద్ద చేపల ఆచూకీ కనిపెట్టేందుకు పకడ్బందీ దర్యాప్తు చేయించటంలేదు. తూతూ మంత్రంగా విచారణ జరిగిందని అనిపించి అవినీతి తిమింగలాలను భద్రంగా రక్షించేందుకు ఉబలాటపడుతోంది. హైకోర్టు సిట్టింగ్ న్యాయమూర్తి పర్యవేక్షణలో కేంద్ర నేరపరిశోధన బృందం (సీబీఐ) ద్వారా విచారణ జరిగితేనే వాస్తవాలు బయటకు వస్తాయి. అలా చేస్తేనే ఒక్క గజం భూమి కూడా అన్యాక్రాంతం కాకుండా చర్యలు తీసుకుంటామన్న ముఖ్యమంత్రి మాటకు విలువ ఉంటుంది. నిష్పాక్షికమైన విచారణ వల్లే దేముడినే నిలువు దోపిడీ చేసేందుకు ఉపక్రమించిన పెద్దల గోత్రనామాలు వెల్లడి అవుతాయి.
కమీషనర్ వెంకటేశ్వర్లు దేవాలయ భూములు అక్రమంగా విక్రయిస్తున్నారని రెండు నెలల క్రితమే మంత్రికి ఫిర్యాదులు అందాయి. దీనిపై కమిషనర్‌ను ఎందుకు వివరణ కోరలేదు? దీనిపై అప్పుడే విచారణ ఎందుకు చేయలేదు? దేవాదాయ శాఖలో భూ కుంభకోణం వెలుగులోకి వచ్చిన తర్వాత శాఖాపరంగా ఎందుకు సమగ్ర దర్యాప్తు చేయించలేదు? రంగారెడ్డి జిల్లా దేవరయాంజల్ ఆలయ భూముల రిజిస్ట్రేషన్ జరగకుండా మంత్రే స్వయంగా నిషేధం విధించారు. కాని కమీషనర్ యధేచ్ఛగా భూములు విక్రయించారు. మంత్రే ఈ ఫైలుపై సంతకం పెట్టారు. మే నెలలో భూముల విక్రయం నిషేధం ఎత్తివేతకు సంబంధించి ఫైలు మంత్రి వద్దకు వచ్చింది. ఈ ఫైలును ముఖ్య కార్యదర్శి రూపొందించారు. దీనిపై ముందు వెనుక చూడకుండా ఎటువంటి అభ్యంతరాలు వ్యక్తపరచకుండా, వివరణ కోరకుండా మంత్రి సంతకం పెట్టేశారు. భూముల రిజిస్ట్రేషన్ జరగకుండా తనే నిషేధం విధించిన సంగతి తెలిసి కూడా పీసీసీ అధ్యక్షుని సిఫార్సు లేఖపై తగిన చర్యలు తీసుకోమని ఎందుకు చెప్పవలసి వచ్చింది? మంత్రి సిఫారసు ఆధారంగా రిజిస్ట్రేషన్ నిషేధ ఉత్తర్వు ఎత్తివేత ఫైలు కూడా కదిలిన మాట వాస్తవం కాదా? తాను విధించిన నిషేధాన్ని మంత్రి ఎత్తివేశారు. పైగా 50 వేలకు పైగా దేవాలయ భూములను విక్రయిస్తానని, ఎమ్మెల్యేలు నియమించిన కమిటీ భూముల రేట్లు నిర్థారిస్తుందని మంత్రి చేసిన ప్రకటనలో ఆంతర్యం ఏమిటి? దీన్నిబట్టి ఈ మొత్తం గోల్‌మాల్ మంత్రికి తెలియకుండా జరగలేదు. పీసీసీ అధ్యక్షుడు కేశవరావు చెప్పిన పైరవీని పురస్కరించుకుని కొన్ని భూముల అమ్మకం వ్యవహారం చూడమని తానే అధికారులకు పురమాయించానని మంత్రి సత్యనారాయణరావే స్వయంగా చెప్పారు. దేవుడి మాన్యాల బదలాయింపులపై నిషేధం అడ్డు వస్తుందని అధికారులు సూచించగా తానే నిషేధాన్ని సడలించమని ఆదేశించానని సత్యనారాయణరావు అంటున్నారు. ఈ లెక్కన ఈ కుంభకోణంలో ప్రధాన పాత్రధారి సత్యనారాయణరావే కదా! ఈ కుంభకోణంలో నా తప్పులేదు... పీసీసీ అధ్యక్షుడి తప్పు అంతకంటే లేదు. ప్రిన్సిపుల్ సెక్రటరీ తప్పు లేదు... అని మంత్రి బుకాయించడం దారుణం. తప్పు చేసిన మంత్రే తాను అపరాధినని చెప్పుకోవడం.. ఇందుకు ముఖ్యమంత్రిగారు తలూపడం వింతల్లోకెల్లా వింత. భూ విక్రయాల గురించి పత్రికల్లో వచ్చిన వార్తలన్నీ యధార్థమని, అధికారులు తనను తప్పుదారి పట్టించారని మంత్రి సత్యనారాయణరావు మంత్రివర్గ సమావేశంలోనే వాపోయారు. ఈ అడ్డగోలు పందేరాలకు తలుపులు బార్లా తెరిచింది మంత్రే అయినప్పుడు జరిగిన తప్పిదానికి జవాబుదారీ ఆయనది కాకపోతే మరెవరిది? మంత్రి చేస్తున్న వితండవాదాన్ని ముఖ్యమంత్రి సమర్థించడం, ఈ అక్రమాలతో మంత్రికేమీ సంబంధంలేదని చెప్పడం, రాజీనామాను బుట్టదాఖలు చేయడం, మంత్రి శాఖను మార్చటం కాంగ్రెస్ రాజకీయ నయవంచనలో భాగమే. ముఖ్యమంత్రి, మంత్రి సత్యనారాయణరావు ఎవరికివారు తాము సచ్చీలురైనట్లు ప్రకటించుకున్నప్పుడు మరి ఈ విచారణలు, దర్యాప్తులెందుకో! నిజానిజాలు తెలియవలసింది న్యాయ పరీక్షలో... కనీసం న్యాయ విచారణ పూర్తయ్యేవరకు మంత్రి పదవి నుంచి సత్యనారాయణరావును తప్పించి ఉంటే వాస్తవాలు బయటపడేవి. అంతవరకు వేచి ఉండే ఓపిక లేకుండా పిల్లికి ఎలుక సాక్ష్యమన్నట్లుగా మంత్రి వాదనను ముఖ్యమంత్రి సమర్థించడం, పనికిమాలిన కితాబులివ్వడం గమనిస్తే ఈ భారీ స్కాంలో ముఖ్యమంత్రి పాత్ర, ఆయన కుటుంబ సభ్యుల నిర్వాకం, మంత్రిగారి కుమారుడి అవినీతి చేష్టలు, కాంగ్రెస్ పార్టీకి చెందిన ఇతర నాయకులు, మంత్రులు, ఎంపీలు ప్రచ్ఛన్న హస్తం ఎక్కడ బయటపడుతుందన్న ఆదుర్దా, భయం వ్యక్తమవుతోంది.
జె.పి.మూర్తిపై అంత మక్కువ ఎందుకు?
దేవాలయ భూముల కుంభకోణంలో పలు ఆరోపణలు ఎదుర్కొంటున్న హోంశాఖ ముఖ్య కార్యదర్శి జె.పి.మూర్తి ఇంటిపై అవినీతిశాఖ అధికారులు దాడులు జరిపారు. దాడులలో ఏ సమాచారం లభించింది. సోదా చేసిన వస్తువులు, లభించిన సమాచారంపై ఎందుకు పంచనామా జరపలేదు. ప్రభుత్వం ఆయనపై ఇంతవరకు ఎటువంటి చర్య ఎందుకు తీసుకోలేదు. దేవాలయ భూముల అక్రమాలపై ఎ.సి.బి. విచారణ జరుగుతుండగానే ఆయన విదేశాలకు వెళ్ళేందుకు ప్రభుత్వం ఎలా అనుమతి ఇచ్చింది. విదేశాల నుంచి వచ్చిం తర్వాత ఆయన ఇంటిపై ఎ.సి.బి. దాడి జరిపింది. ఎ.సి.బి. దాడి జరిగిన వెంటనే ప్రభుత్వం జె.పి.మూర్తిని హోంశాఖ ముఖ్య కార్యదర్శి పదవి నుంచి ఎందుకు తప్పించలేదు. ఆయనపై చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం ఎందుకు వెనుకాడుతోంది. దేవాదాయశాఖామంత్రి సత్యనారాయణరావుకు న్యాయ విచారణ మొదలు కాకుండానే క్లీన్ చిట్ ఇచ్చి శాఖ మార్చి సీఎం హోంశాఖ ముఖ్య కార్యదర్శి జె.పి.మూర్తిపై ఇంకా ఎందుకు మమకారంతో ఉన్నారు. ఒక పక్క ఎ.సి.బి. విచారణ, మరో పక్క న్యాయ విచారణ జరుగుతుండగా ఆయన లాంగ్ లీవ్‌లో వెళ్ళేందుకు ఎందుకు అనుమతించారు?

రాష్ట్రంలో 32 వేల దేవాలయాలు ఉంటే వాటిలో సుమారు 21 వేల గుళ్ళకు చెప్పుకోదగిన మాన్యం లేదు. పదకొండు వేల దేవాలయాలకు భూములు ఉన్నాయి. ప్రభుత్వ లెక్కల ప్రకారం 3 లక్షల 76 వేల ఎకరాల భూములు గుడి మాన్యాల కింద ఉన్నాయి. ఇందులో 77,182 ఎకరాలు మాగాణి; 2.22 లక్షల ఎకరాలు మెట్ట; 5,562 ఎకరాల్లో పళు్ళ, పూల తోటలు ఉన్నాయి. వీటిలో అత్యధిక భాగం భూస్వాముల ఆక్రమణలు ఉన్నాయి. పేద కౌలుదార్లు సాగు చేసుకుంటున్న భూములు ఉన్నాయి. వీటి విస్తీర్ణం తక్కువ. ఎన్ని వేల ఎకరాలు భూములు ఉన్నప్పటికీ వేలాది దేవాలయాలను నిత్య ధూప, దీప, నైవేద్యాది కార్యక్రమాలు నిర్వహించటంలేదు. మాన్యం భూముల నుంచి ఆదాయం ఆలయాలకు అందటంలేదు. ఈ సమస్యను శాశ్వతంగా పరిష్కరించే ఉద్దేశంతో ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉండగా చల్లా కొండయ్య కమిషన్‌ను నియమించారు. దేవాలయ భూములన్నిటినీ మార్కెట్ ధరకు అమ్మి, అలా వచ్చిన సొము్మతో దేవాలయాల నిర్వహణకు ఏర్పాట్లు చేయాలని ఈ కమిషన్ సిఫార్సు చేసింది. కమిషన్ సిఫార్సులను వ్యతిరేకిస్తూ రైతులు న్యాయస్థానాలను ఆశ్రయించారు. కోర్టు `స్టే' మంజూరు చేయటంతో ఈ సిఫార్సులు అటకెక్కాయి. ఆలయ భూములను పేదలకు నివేశన స్థలంగా పంచాలని, ఆ విధంగా వచ్చిన భూమికి వెలకట్టి ప్రభుత్వం దేవాదాయ శాఖకు చెల్లించాలని 1995లో రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం చేసింది. ఈ మేరకు సెప్టెంబర్ 29, 1995న జీవో జారీ చేశారు. ఈ జీవోపై కొందరు హైకోర్టుకు వెళ్ళి `స్టే' తెచ్చుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు అప్పీలు వెళ్ళింది. కౌలుదారులకు రెండున్నర ఎకరాల మాగాణి, అయిదు ఎకరాల మెట్ట భూమి మించకుండా కేటాయించాలని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. కౌలుదారుకు కేటాయించిన భూమికి మార్కెట్ రేటులో నాలుగింట మూడు వంతులు వారి నుంచి వసూలు చేయాలని నిర్ణయించింది.
Friday, September 10, 2010
వినాయక చవితి వేడుకలను జరుపుకుందాం
భాద్రపద శుద్ధ చవితినాడు మనం వినాయక చవితి వేడుకలను జరుపుకుంటాం. అయితే, అసలు చవితినాడు పండుగ ఎందుకు చేసుకుంటాం? ఆ రోజు వినాయకుడు గణాలకు నాధుడిగా నియమించబడ్డాడు. కనుక ఆ రోజు హిందూవులకు అతి పవిత్రమైన రోజు. విఘ్నేశ్వరుని పూజించి సేవిస్తారు. దీనికి ఇంకో కారణం కూడా ఉంది...! సూర్యోదయానికి ముందు తూర్పున ఏ నక్షత్రాలు ఉదయిస్తాయో ఆ నక్షత్రాలకు సంబంధించిన దేవుడి పండుగ జరుపుకోవాలనేది రుగ్వేదంలోని నియమం. కనుక భాద్రపద శుద్ధ చవితినాడు సూర్యోదయానికి ముందు తూర్పున వినాయక నక్షత్రాలు ఉదయిస్తాయి. కాబట్టి ఆ రోజు వినాయక చవితిగా భారత దేశంలోని హిందూవులు వేడుకలు జరుపుకుంటారు. అలాగే, గ్రహాల్లోకెల్లా ముఖ్యమైన గ్రహం శనిగ్రహం. శనీశ్వరుడి ప్రభావం మనకు తెలిసిందే. సకల దేవతలూ భయపడే శనీశ్వరుడు స్వయం రక్షణ కోసం వినాయక కవచాన్ని ధరిస్తాడట. వినాయకుని మహత్యం ఇంతా అంతా మరి...! 
పార్వతీ పరమేశ్వరుల కుమారులు విఘ్నేశ్వరుడు, కుమారస్వామి పెరిగి పెద్దవారయ్యారు. తన తర్వాత గణాలకు అధిపతిని నియమించే సమయం ఆసన్నమైందని ఈశ్వరుడు తలిచాడు. ఆ సమయంలో నేనే పెద్ద! అంటూ కుమారస్వామి అన్నగారిని తక్కువ చేసి మాట్లాడాడు. ఏనుగు తొండం ఉన్నవాడు అధిపతి ఎలా అవుతాడని ప్రశ్నించాడు. దీంతో కైలాసనాథుడు ఇద్దరు కుమారుల మధ్య ఓ పోటీ పెట్టాడు. భూలోకంలోని సమస్త పుణ్యతీర్థాలలో ముందుగా స్నానమాచరించి ఎవరు కైలాసానికి చేరుకుంటారో వారికే పట్టం కడతానని మహేశుడు చెప్పాడు. దీంతో వాయువేగంతో నెమలి వాహనంపై కుమారస్వామి బయలుదేరి వెళ్లాడు. తన మూషిక వాహనంపై వెళ్లి ఎలా విజయం సాధించగలనని విఘ్నేశ్వరుడు చింతాక్రాంతుడయ్యాడు. తల్లిదండ్రులే దైవమని భావించి వారి చుట్టూ భక్తితో ప్రదక్షిణ చేయసాగాడు. అచట స్నానానికి వెళ్లిన కుమారస్వామికి అన్నయ్య స్నానం పూర్తి చేసుకుని ఎదురు రావడం కనిపించింది. దీనితో అన్నగారి మహత్యం తెలుసుకున్న కుమారస్వామి వినాయకుడే పట్టానికి అర్హుడని భక్తితో తండ్రికి తెలిపాడు. భాద్రపద శుద్ధ చవితి నాడు శివుడు గణాలకు నాయకుడిగా విఘ్నేశ్వరుని నియమించాడు. అప్పటినుంచీ ఆయనకు గణనాధుడు, గణేశుడు అని పేర్లు వచ్చాయి.
శుభాలు కలిగించే పత్రాల పూజ...!
వినాయక చవితి నాడు చేసే పూజలో కీలకమైనది 21 ప్రతాలతో చేసే పూజ. ఈ పూజ చేయడం ద్వారా కష్టాలు తొలగిపోయి అషై్టశ్వర్యాలు కలుగుతాయని భక్తుల నమ్మకం. ఈ పూజలో ముఖ్యమైనది గరిక. గరిక అంటే స్వామి వారికి ఎంత ఇష్టమో మనకు తెలిసిందే. దీనిని దూర్వా పత్రమని అంటారు. ఇందులో తెల్ల గరిక, నల్ల గరిక అని రెండు రకాలు ఉంటాయి. తర్వాతది మాచీపత్రం అంటే చేమంతి జాతికి చెందిన ఆకులు. ఈ ఆకులు సువాసన భరితంగా ఉంటాయి. తర్వాతి పత్రం అపామార్గ పత్రాలు. ఇవి గుండ్రంగా ఉంటాయి. దీనినే తెలుగులో ఉత్తరేణి అని అంటారు. వీటితో పాటు బృహతీ పత్రం, దీన్నే ములక అని అంటారు. వీటిలో చిన్న ములక, పెద్ద ములకలు అని రెండు రకాలు ఉన్నాయి. దుత్తూర పత్రం, అంటే ఉమ్మెత్త ఆకులు. వంకాయ జాతికి చెందిన చెట్లు ఇవి. తులసీ పత్రం, ఈ పత్రాల గురించి ప్రత్యేకంగా చెప్పేదీ ఏమీ లేదు. దేవతార్చనలో వాడే ఈ పత్రాలు మంగళదాయకమైనవి. శమీపత్రం, జమ్మిచెట్టు ఆకులను శమీపత్రాలు అంటారు. దసరా సమయంలో ఈ చెట్టుకు భక్తులు విశిష్ట పూజలు నిర్వహిస్తారు. మరువక పత్రం, వీటినే ధవనం, మరువం అని కూడా అంటారు. పూల మాలల్లో వీటిని విరివిగా ఉపయోగిస్తారు. కరవీర పత్రం, ఈ పత్రాలను గన్నేరు పత్రాలని కూడా అంటారు. తెలుపు, పసుపు, ఎరుపు ఇలా వివిధ రంగుల్లో ఈ పూలు ఉంటాయి. బిల్వ పత్రం, ఈ పత్రాలను మారెడు దళాలని అంటారు. మూడు ఆకులు కలిసి ఉండే దీనిని దళం అంటారు. వీటితో శివుడిని పూజిస్తే చాలా మంచిది. చూత పత్రం, ఇవే మామిడి ఆకులు. బదరీ పత్రం, బదరీ అంటే రేగాకులు. రేగి కాయ చెట్టుకు ఉండే ఆకులు ఇవి. వీటిలో రేగు, జిట్రేగు, గంగిరేగు అని మూడు రకాలు ఉంటాయి. గుండ్రంగా ఉండే ఆకులను పూజకు ఉపయోగించాలి. విష్ణుక్రాంత పత్రం, తెలుపు, నీలం రంగు పులుండే చెట్లు ఇవి. నీలం రంగు పులు ఉండే చెట్టును విష్ణుక్రాంత చెట్టుగా పిలుస్తారు. 
Friday, March 19, 2010
గిరిజనంతో విదేశీ ఆట
నలుగురు బాలికల అనుమానాస్పద మృతి!
కారణాలు వేరంటూ ముగించిన సర్కార్!
గిరిజనులపైనే ఎందుకు?: ఎంపీ బలరాం
నిలదీయరన్న నమ్మకంతోనే: సంఘాలు
క్లినికల్ ట్రయల్స్ కాదన్న ఆరోగ్యమంత్రి
తెలంగాణ ప్రజలు జంతువులా: టీఆర్ఎస్
క్యాన్సర్ టీకాల ప్రయోగం వికటించిందన్న వార్తల నేపథ్యంలో అసలా ప్రయోగాలకు రోశయ్య సర్కారు ఎలా అనుమతిస్తుందని కడప ఎంపీ జగన్మోహన్‌రెడ్డి నిలదీస్తున్నారు. ఈ టీకాలకు ఎవరు అనుమతిచ్చారో నాకు తెలియదు... అంటూ రోశయ్య.. పరోక్షంగా వాటికి అనుమతి ఇచ్చింది వైఎస్ అన్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు.
రాష్ట్ర ఆరోగ్య మంత్రి ఇవి క్లినికల్ ట్రయల్స్ కావని స్పష్టం చేస్తున్నారు. బాలికలు చనిపోవడానికి, టీకాలకు సంబంధం లేదని తేల్చేశారు. ఈ నేపథ్యంలో అసలు ఖమ్మం ఏజెన్సీలో ఏం జరుగుతోందో ఒక సారి గమనిస్తే....
లైంగిక సంబంధాల్లో హెచ్‌పీవీ అనే వైరస్ ద్వారా వచ్చే సర్వైకల్ క్యాన్సర్‌ను నివారించే టీకాను శాస్త్రవేత్తలు 20 ఏళ్ల పాటు పరిశోధించి తయారు చేశారు. దీని పేరు గర్ధాసిల్. దీనిని మూడు డోసులు తీసుకుంటే జీవితాంతం గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ రాదని కంపెనీ చెబుతోంది. అమెరికా సహా అనేక దేశాల వైద్యసంస్థలు ఈ టీకాను ఆమోదించాయని చెబుతున్నారు.
మన దేశంలో 'పాత్' అనే ప్రభుత్వేతర సంస్థ బిల్ అండ్ మిలిండా గేట్స్ ఫౌండేషన్ ఆర్థిక సహాయంతో టీకాల కార్యక్రమాన్ని చేపట్టింది. గుజరాత్‌లోని వడోదరా, ఆంధ్రప్రదేశ్‌లోని ఖమ్మం జిల్లా ఏజెన్సీలను ఎంచుకుంది.
2008 డిసెంబర్ 31న ఈ ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతిచ్చింది. టీకాలకు 10-14 ఏళ్ల వయసు గల బాలికలను ఎంచుకున్నారు. కొత్తగూడెం, భద్రాచలం, తిరుమలాయపాలెంలలో క్యాం పులు పెట్టి 14,091 మంది బాలికలకు టీకాలు వేశారు. వీరిలో 70% గిరిజన బాలికలే. అధికారులు మాత్రం 30% మందే గిరిజన బాలికలని చెబుతున్నారు.
నలుగురి మరణం....
టీకాలు తీసుకున్న వారిలో గిరిజన బాలికలు కె.సరిత (13), సోడే సాయికుమారి(14), క ంపెల్లి స్వాతి(13) ముంద్రబోయిన సూర్యలక్ష్మి (12) చనిపోయారు. సరిత, సాయికుమారి ఆత్మహత్య చేసుకున్నారని ప్రభుత్వం చెబుతోంది. సరిత మరణించే నాటికి రెండు డోసుల టీకా తీసుకున్నారు.
భద్రాచలం మండ లం ఎర్రగడ్డకు చెందిన సోడే సాయికుమారి మొదటి దశ టీకా వేసుకున్న 14 రోజుల తర్వాత మరణించింది. కంపెల్లి స్వాతికి గత ఏడాది జూలై 17న టీకా ఇచ్చారు. ఆమె తీవ్ర జ్వరంతో ఆగస్టు 8న మరణించారు. సూర్యలక్ష్మి ప్రమాద వశాత్తు చనిపోయినట్లు ప్రభుత్వం నివేదికలో పేర్కొంది.
ఏజెన్సీనే ఎందుకు ఎంచుకున్నారు?
గతంలో చిన్న పిల్లలకు అంగవైక్యలం రాకుండా ఇచ్చే టీకాలకు కూడా తొలుత ఖమ్మం ఏజెన్సీనే ఎంచుకున్నారు. ఇప్పుడు క్యాన్సర్ టీకాలకు కూడా ఈ ప్రాంతాన్నే ఎంచుకున్నారు. ఇందుకు గిరిజన సంఘాలు కొన్ని కారణాలు చెబుతున్నాయి.
"ఏజెన్సీలో టీకాలు వికటించి మరణించినా... అవి రోజువారి చావు ల ఖాతాలోకి వెళ్తాయి. ఈ మనిషి ఎందుకు చనిపోయాడు? టీకా వికటించిం దా? అని పరిశీలించే నాథుడు ఉండరు. గిరిజనులయితే చెప్పింది వింటారు. గిరిజనేతరులకు చదువు ఉంటుంది కాబట్టి ప్రయోగాలపై సవాలక్ష సందేహాలడుగుతారు. ఎవరైనా చనిపోతే గొడవైపోతుంది. అందుకే గిరిజన ప్రాంతాలను ఎంచుకుంటారు'' అని లంబాడా హక్కుల పోరాట సమితి నేత బెల్లయ్య నాయక్ చెబుతున్నారు.
టీకాలు తీసుకున్నాక తలెత్తిన ఆరోగ్య సమస్యలకు అత్యవసర వైద్యం పొందే అవకాశం ఉండటం లేదు. స్వాతి మరణానికి ఇదే ప్రధాన కారణమని గిరిజన సంఘాలు చెబుతున్నాయి. ఇక సరిత, సూర్యలక్ష్మిలు ఆత్మహత్యచేసుకున్నారని అధికారులు చెబుతున్నారు. వీరి ఆత్మహత్యలకు ఎలాంటి కారణాలు లేవు. కారణం లేకుండానే ఆత్మహత్యలు ఎందుకు చేసుకున్నారన్న ప్రశ్నకు జవాబు లేదు. పాత్ సంస్థ, ప్రభుత్వ పరపతిని కాపాడుకునేందుకు అధికారులు ఆ మరణాలను ఆత్మహత్యలుగా చిత్రీకరిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఏజెన్సీలో ఎలా అనుమతిస్తారు? ఎంపీ బలరాం నాయక్
గిరిజన బాలికల మరణాలపై కాంగ్రెస్ ఎంపీ బలరాం నాయక్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. గురువారం ఆన్‌లైన్ ఆయన్ను పలకరించినప్పుడు ఆవేదన వ్యక్తం చేశా రు. "ఏజెన్సీలో ప్రయోగాత్మక టీకాలు వేసేందుకు ఎలా అనుమతిస్తారు? హైదరాబాద్ లాంటి ప్రాంతాల్లో ఎందు కు ఆ కార్యక్రమాన్ని అమలు చేయరు?'' అని ప్రశ్నించారు. బాలికల మరణాలపై విచారణ జరిపించాలని ఆయన కోరారు.
టీకాలను తెలంగాణ ప్రాంతంలో ప్రయోగించటంపై టీఆర్ఎస్ మండిపడింది. తొలుత జంతువులపై ప్రయోగించాల్సిన మందును మనుషులపై ప్రయోగించటానికి ఎలా అనుమతించారని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. మందులు ప్రయోగించటానికి తెలంగాణ ప్రజలు జంతువులా? అని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు గురువారం ఆగ్రహం వ్యక్తం చేశారు.
టార్గెట్ 2010
న్యూఢిల్లీ, మార్చి 18: ఓ వైపు పెద్ద ఎత్తున రగడ జరుగుతున్నా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి, బీఎస్పీ అధినేత్రి మాయావతి మరో కరెన్సీ గజమాలను స్వీకరించడం వెనుక ఉద్దేశమేంటి? తనపై విమర్శలకు ప్రతిపక్షాలను ఉసిగొల్పేలా అవకాశం ఇవ్వడం వెనుక ఎత్తుగడలున్నాయా? ఇప్పుడు రాజకీయవర్గాల్లో ఇదో పెద్ద చర్చ.
కాంగ్రెస్ నేతలు తనను దళిత పుత్రిక కాదు.. ధనిక పుత్రిక అంటూ విమర్శలు గుప్పిస్తున్నా.. మాయావతి చర్యలు పకడ్బందీ వ్యూహంతోనే ఉంటున్నాయనేది ఆ పార్టీ కార్యకలాపాలను దగ్గరగా పరిశీలిస్తున్న రాజకీయ విశ్లేషకుల వ్యాఖ్య. అటు క్షత్రియులు.. ఇటు బ్రాహ్మణులను సైతం తనవైపు తిప్పుకుని గత అసెంబ్లీ ఎన్నికల్లో మాయావతి ఘన విజయం సాధించారు.
ఒక దశలో మాయావతి కాబోయే దేశ ప్రధాని అన్న వాతావరణం కూడా నెలకొంది. బీఎస్పీ కూడా.. తమ తదుపరి లక్ష్యం హస్తిన పీఠమేనని ప్రకటించింది. లోక్‌సభ ఎన్నికల్లో సమాజ్‌వాది ఘోరంగా దెబ్బతిన్నది. కేంద్రంలో అధికారంలోకి రాగలిగినా.. యూపీలో కాంగ్రెస్ చెప్పుకోదగ్గ ఫలితాలు సాధించలేదు.
అయితే ప్రస్తుతం యూపీలో కాంగ్రెస్‌కు పూర్వ వైభవం సాధించేందుకు ఆ పార్టీ యువ ఎంపీ రాహుల్ గాంధీ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. పదే పదే యూపీలో పర్యటనలు చేయడం, సాధారణ ప్రజలతో మమేకమవడం తదితర క్షేత్ర స్థాయి కార్యకలాపాలతో పాటు.. రాష్ట్రంలో యూత్ కాంగ్రెస్‌ను పునరుజ్జీవింప చేసే యత్నాల్లో ఉన్నారు.
ఆ దిశగా కొంత పురోగతి కూడా సాధించారని ఇటీవలి యూత్ కాంగ్రెస్ సభ్యత్వ నమోదు వెల్లడిస్తోంది. దేశంలోనే అత్యధిక సభ్యత్వం యూత్ కాంగ్రెస్్‌కు ఇక్కడే లభించింది. ఈ నేపథ్యంలో ఆమె కాంగ్రెస్‌నే తన ప్రధాన లక్ష్యంగా చేసుకుంటున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు. కాంగ్రెస్‌ను ఇరకాటంలోకి నెట్టేందుకు నల్లధనం అంశాన్ని బయటకు తీయాలనేది మాయావతి ఆలోచనగా చెబుతున్నారు.
బహిరంగంగా విరాళాలు స్వీకరించడం ఇందులో భాగమేనన్న వాదన వినిపిస్తోంది. గతంలో కూడా మాయావతి తన పుట్టిన రోజుల సందర్భంగా, పార్టీ ఆవిర్భావ దినోత్సవాల సందర్భంగా పెద్ద ఎత్తున నగదు రూపంలో బహుమతులు స్వీకరించేవారు! వీటన్నింటిలో బహిరంగంగా విరాళం స్వీకరించడం అనే ఒక ఉమ్మడి అంశం కనిపిస్తుంది.
తాజాగా రెండు దండలనూ మాయావతి బహిరంగంగానే స్వీకరించారు. తద్వారా మనువాదపార్టీలను బహిరంగంగా సవాలు చేయాలన్న ఉద్దేశంతో మాయవతి ఉన్నారని పరిశీలకులు అంటున్నారు. మనీవాదిగా తనపై ముద్ర పడుతున్నప్పటికీ.. అది ప్రత్యర్థి పార్టీలను రెచ్చగొట్టి.. తన ఉచ్చులోకిలాగే ప్రయత్నమన్న వాదన కూడా వినిపిస్తోం ది.
నగదు వ్యవహారంపై ఆ పార్టీలు మాట్లాడితే.. నల్లధనం అంశంపై వాటిని కార్నర్ చేయడం మాయ వ్యూహంగా కనిపిస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కూడా ఆమె ఈ అంశాన్ని ప్రస్తావించారు. సమాజ్‌వాది, కాంగ్రెస్ నాయకులకు విదేశాల్లో పెద్దఎత్తున నల్లధనం ఖాతాలున్నాయని, తాము అధికారంలోకి వస్తే వాటి ని వెనక్కు తెప్పిస్తామని కూడా ప్రకటించారు.
తన విగ్రహాలను, ఏనుగుబొమ్మలను ప్రతిష్ఠించడాన్నీ ఆమె సమర్థించుకుంటున్నారు. లక్నోలో విగ్రహాల ఏర్పాటు నేపథ్యంలో.. తమ పార్టీ ఎన్నికల చిహ్నాన్ని ఈసీ రద్దు చేసేట్లయితే.. కాంగ్రెస్ , సమాజ్‌వాది పార్టీల ఎన్నికల గుర్తులను కూడా రద్దు చేయాలని ఆమె సవాలు చేస్తూ.. ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉండగానే ప్రధాన పక్షాలతో కయ్యానికి సై అంటున్నారు.
మొత్తానికి.. గత ఎన్నికల్లో 'సోషల్ ఇంజనీరింగ్' ద్వారా అధికారంలోకి వచ్చిన మాయావతి.. తాజాగా.. మనువాదులను సవాలు చేస్తూ.. ఆ అధికారాన్ని 2012 ఎన్నికల్లో నిలుపుకోవడం కోసం వ్యూహ రచనలో నిమగ్నమై ఉన్నారని చెబుతున్నారు.
ఇళ్లు కట్టి చూడరు!
మొదలు కాని లబ్ధిదారుల ఎంపిక
కొత్త ఇళ్లకు 'బోగస్' అడ్డంకి
ఎంతకీ తేలని అనర్హుల లెక్క
బడ్జెట్‌లోనూ అరకొర కేటాయింపులు
కొత్త ఇళ్ల మంజూరుపై సందేహాలు
ముందే హెచ్చరించిన 'ఆంధ్రజ్యోతి'
'ఇందిరమ్మ' ఇంటి కథ కంచికి చేరుతోంది. మంజూరు చేసిన వాటిలో లక్షల ఇళ్లు బోగస్! మంత్రిగారి మాటలు బోగస్! అంకెల గొప్పలకు పోయి విచ్చలవిడిగా లక్షల్లో ఇళ్లు మంజూరు చేశారు. వాటిలో 'బోగస్' ఏరివేత ప్రారంభించారు. ఈ ప్రహసనం ముగియకముందే... ఫిబ్రవరిలో కొత్త ఇళ్లు మంజూరు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. కానీ... ఆ తర్వాత ఊసే మరిచిపోయింది.
కొత్త ఇళ్ల మంజూరు గురించి జనవరి 11న గృహ నిర్మాణ శాఖ మంత్రి శిల్పా మోహన్‌రెడ్డి ప్రకటించారు. ఆ శాఖకు చెందిన ప్రాజెక్టు డైరెక్టర్లతో సమీక్ష నిర్వహించిన అనంతరం ఆయన ఈ విషయం తెలిపారు. అయితే.. ఫిబ్రవరి నెల గడిచినా అర్హులైన లబ్ధిదారులకు ఇళ్లు మంజూరు చేసే ప్రక్రియ మొదలుకాలేదు. అసలు ఇది ఎప్పుడు మొదలవుతుందో తెలియని పరిస్థితి నెలకొందని ఆ శాఖ వర్గాలు తెలిపాయి.
పాత లబ్ధిదారుల్లో బోగస్ లెక్క తేలితేగానీ... కొత్త లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ మొదలయ్యే అవకాశం లేదు. గతంలో ప్రభుత్వం అడగని వాడిదే పాపం అన్నట్లుగా... అర్హతలతో సంబంధం లేకుండా అడ్డగోలుగా ఇళ్ళు మంజూరు చేస్తూ పోయింది. ఎన్నికలు దగ్గర పడే కొద్దీ 'రికార్డు' స్థాయిలో ఇళ్ల సంఖ్య పెంచుకుంటూ పోయింది.
ఇందిరమ్మ తొలి దశలో 23,91,776... రెండో దశలో 29,58,870 ఇళ్లు, మూడో దశ కింద 25,26,059 ఇళ్ళు మంజూరు చేశారు. దీంతో పాత ఇళ్ళు 2,62,572 కలుపుకొంటే మూడు దశల్లో ఇందిరమ్మ కింద మంజూరు చేసిన ఇళ్ల సంఖ్య 81,29,277కి చేరింది. ఇందిరమ్మ పథకం తొలి దశ పూర్తయినప్పుడే... ఈ పథకం బోగస్ లబ్ధిదారుల చేతుల్లోకి వెళుతోందని 'ఆంధ్రజ్యోతి' వెలుగులోకి తెచ్చింది.
అనర్హులకు ఇల్లు మంజూరు చేయడం, ఒక్కొక్కరు రెండు మూడేసి ఇళ్లు మంజూరు చేయించుకోవడం, మితిమీరిన రాజకీయ జోక్యం... వంటి అక్రమాలపై వరుస కథనాలు ప్రచురించింది. దీనిపై స్పందించిన అప్పటి గృహ నిర్మాణ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ 'బోగస్ ఇల్లు చూపిస్తే వెయ్యి రూపాయలు బహుమతి' అని ప్రకటించారు. ఆ తర్వాత 'ఆంధ్రజ్యోతి' ఎన్నో బోగస్ ఇళ్లను చూపించింది.
వామపక్షాలు సైతం ఇందిరమ్మ ఇళ్లలో అవతకవతకలపై ఉద్యమించాయి. ఈ వాస్తవాలను కొట్టివేస్తూ వచ్చిన ప్రభుత్వానికి... రెండోసారి అధికారంలోకి వచ్చాకగానీ అసలు విషయం అర్థం కాలేదు. పరిస్థితి తీవ్రతను గమనించి ప్రభుత్వమే బోగస్ లబ్ధిదారుల ఏరివేత ప్రారంభించింది. దుర్వినియోగమైన నిధులను రెవెన్యూ రివకరీ చట్టం ద్వారా రాబట్టేందుకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసింది. ఇప్పుడు బోగస్ లబ్ధిదారుల గుర్తింపుతో ముడిపెట్టి... కొత్త లబ్ధిదారుల ఎంపికను జాప్యం చేస్తోంది.
అసలుకే చిల్లు...
ఇందిరమ్మ పథకం కింద మూడు దశల్లో మంజూరు చేసిన ఇళ్లలో వాటిలో 19 లక్షల లబ్ధిదారుల వివరాలు 'ఆన్‌లైన్'లో నమోదు కాలేదు. దీంతోపాటు మరో 17 లక్షల ఇళ్లు ఇంత వరకూ ప్రారంభానికి నోచుకోలేదు.
ఈ రెండింటినీ కలిపితే... మొత్తం 36 లక్షల ఇళ్ల పరిస్థితి గందరగోళంలో పడినట్లే! బోగస్ లబ్ధిదారులను గుర్తించేందుకు ఉద్దేశించిన సమగ్ర సర్వే గడువును మార్చి నెలాఖరు వరకు పొడిగించారు. దీనికి సంబంధించిన నివేదికల తయారీ ప్రక్రియ ఏప్రిల్ నెల రెండో వారం వరకు కొనసాగే అవకాశం ఉంది.
ఈ బోగస్ లెక్కలు తేలితేగానీ కొత్త ఇళ్ల మంజూరు కార్యక్రమం ప్రారంభమయ్యే అవకాశం కన్పించడం లేదని అధికార వర్గాలు తెలిపాయి. 2010-11 బడ్జెట్‌లో గృహ నిర్మాణ శాఖకు రూ.1800 కోట్లు మాత్రమే కేటాయించారు. ఈ నిధులు ఇప్పటికే అమలులో ఉన్న ఇళ్ల నిర్మాణానికే సరిపోవని... ఒకవేళ కొత్తవి మంజూరు చేసినా, పనులు ఇప్పట్లో ప్రారంభం అయ్యే అవకాశం లేదని అంటున్నారు.
తెరుచుకోని ఖాతాలు
ప్రస్తుతం ఇందిరమ్మ పథకం కింద 17.32 లక్షల ఇళ్ల పనులు సాగుతున్నాయి. ఇందులో కేవలం ఆరు లక్షల మంది లబ్ధిదారులు మాత్రమే బ్యాంకు లేదా పోస్టాఫీసుల్లో ఖాతాలు తెరిచారు. అంటే, సర్కారు చెబుతున్న దాని ప్రకారం చూసినా చెల్లింపులు కేవలం ఈ ఆరు లక్షల మందికి మాత్రమే పరిమితం అయ్యాయి.
ఖాతాలు తెరవని 11.32 లక్షల మంది లబ్ధిదారులకు చెల్లింపులు ఎక్కడవి అక్కడే నిలిచిపోయాయి. ఇందిరమ్మ లబ్ధిదారుల ఖాతాలు తెరిచేందుకు బ్యాంకులు ముందుకు రావటంలేదని ఆ శాఖ వర్గాలు తెలిపాయి. పాత ఇళ్ల పరిస్థితి ఇలా ఉండగా... ఇందిరమ్మ కింద కొత్త ఇళ్లు మంజూరు చేయాల్సిందిగా గృహ నిర్మాణ శాఖపై ప్రజాప్రతినిధుల నుంచి పెద్ద ఎత్తున ఒత్తిడి వస్తోంది.























.jpg)








